గీసుగొండ, ఆగస్టు 29 : విద్యార్థులు చదవుతో పాటు క్రీడల్లో రాణించాలని జాతీయ ఆదర్శ గ్రామ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి సూచించారు. మండలంలోని విశ్వనాధపురం గ్రామ శివారులోని పరకాల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదవుతున్న విద్యార్థులకు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఉచితంగా క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణా ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల్లో క్రీడ నైపుణ్యం అధికంగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడా కారులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు కే రామ్మూర్త్తి, సర్పంచ్ నాగేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.
గొర్రెకుంట ప్రభుత్వ పాఠశాలలో..
క్రీడల్లో విద్యార్థులు రాణించాలని హెచ్ఎం అనిత సూచించారు. 15 డివిజన్ గొర్రెకుంట ప్రభుత్వ పాఠశాలలో సోమవారం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఈటీ రఘువీర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను పోత్సహించడానికి గ్రామానికో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ కుమారస్వామి పాల్గొన్నారు.
దుగ్గొండిలో..
దుగ్గొండి: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు. క్రీడా దిగ్గజం ద్యాన్‌చంద్ పుట్టినరోజు పురస్కరించుకుని నిర్వహించుకునే జాతీయ క్రీడా దినోత్సవాన్ని విద్యార్థులు, క్రీడాకారులు సంబురంగా నిర్వహించారు. దుగ్గొండి మండల కేంద్రంలోని ఆదర్శవాణి ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించగా, దుగ్గొండి మండలాభివృద్ధి అధికారి కృష్ణప్రసాద్, తహసీల్దార్ సంపత్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్‌కట్ వేడుకలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ఆసనాలు వేసి అలరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడుతూ భారతదేశానికి క్రీడల్లో కీర్తి సంపాదించి పెట్టిన క్రీడా దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపడం అభినందనీమన్నారు. క్రీడల్లో భారత గొప్పతనాన్ని ప్రపంచానికి ధ్యాన్‌చంద్ చాటి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శవాణి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ ఎన్ రవి, డైరెక్టర్ బుచ్చయ్య, ప్రధానోపాధ్యాడు కూరోజు దేవేందర్, ఉపాధ్యాయులు కార్తీక్, భరత్, దేవేందర్, శ్రీకాంత్, సుదాకర్, రవితేజ, నాయుడు కోటేశ్వర్, ఆజారొద్దీన్, రాజు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ధ్యాన్‌చంద్ సేవలు మరువలేనివి..
కరీమాబాద్: భారత దిగ్గజం హాకీ ఆటగాడు దేశానికి, క్రీడా రంగానికి ధ్యాన్‌చంద్ చేసిన సేవలు మరువలేనివని 4వ కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మామునూరులోని బెటాలియన్‌లో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ధ్యాన్‌చంద్ సంస్మరణార్థం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం హర్షణీయమన్నారు. క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
రాయపర్తిలో..
రాయపర్తి: మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలు పా ఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల సారథ్యంలో విద్యార్థులకు పలు క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించి, ప్రతిభ చూపిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం జాతీయ హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, ఆవుల వెంకటేశ్వర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎండీ అన్వర్, సమ్మయ్య, ఉపాధ్యాయులు కు మారస్వామి, రమేశ్, సమ్మయ్య, తదితరులున్నారు.