పర్వతగిరి, ఆగస్టు 21 : ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు ఉంటాయని, ఒక సారి మొక్కలు నాటితే 30ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఆయిల్‌పామ్ మొక్కలు నాటడంతోపాటు రైతుల కోసం నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రజలందరికీ లబ్ధి చేకూరేలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.39వేల సబ్సిడీ అందిస్తున్నారని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది 10వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళికలు రూపొందించడం గొప్ప విషయమన్నారు.
ఆయిల్‌పామ్ మొక్కలు పంపిణీ చేసే రామ్ చరణ్ ఇండస్ట్రిస్ వారి సహకారంతో రైతులకు మేలు కలిగేలా చూస్తామన్నారు. 5 ఎకరాల భూమి ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగు కు మొగ్గు చూపాలని కోరారు. తన భూమిలో అధికంగా సాగు చే స్తున్నట్లు చెప్పారు. మొక్కకు, ఎరువులకు ప్రభుత్వం రాయితీ సౌకర్యం కల్పిస్తుందని, బ్యాంకు రుణాలు అందేలా చూస్తామన్నా రు. రైతులకున్న అనుమానాలను తీర్చేవిధంగా వ్యవసాయ, ఉద్యా న శాఖల అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
ఎమ్మెల్యే అ రూరి రమేశ్ మాట్లాడుతూ .. ఆయిల్‌పామ్ సాగు చేసి రైతులు ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ గోపి, ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్‌లాల్, ఎంపీడీవో సంతోష్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్‌గౌడ్, సర్పంచ్ చింతపట్ల మాలతీసోమేశ్వర్రావు, హార్టికల్చర్ అధికారులు శ్రీనివాస్‌రావు, ఐలయ్య, జేడీఏ ఉషాదయాళ్, ఏవో ప్రశాంత్‌కుమార్, తహసీల్దార్ కోమీ, ఐకేపీ రవీందర్‌రాజు, సుధాకర్, ఏఈవోలు, పాల్గొన్నారు.