ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బోనాల పండుగ ఘనంగా జరిగింది. శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో పోచమ్మ, ముత్యాలమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో బోనాల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగగా, పోతరాజులు, శివసత్తుల విన్యాసాలు ఆకట్టకున్నాయి. మహిళలు బోనాలతో ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, తల్లికి బోనం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా జెల్లను, గొడ్డూ గోదను సల్లంగ చూడు తల్లీ అని వేడుకున్నారు.
-నమస్తే నెట్వర్క్