రాయపర్తి, ఆగస్టు 21: దైవ సన్నిధానంలోనే ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని జగన్నాథపల్లికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ నంగునూరి శ్రీశారద-అశోక్‌కుమార్ దంపతులు తమ తండ్రి నంగునూరి సోమయ్య స్మారకార్థం రూ. 23 లక్షల వ్యయంతో గ్రామంలో శ్రీహనుమాన్ ఆలయం నిర్మించారు.
ఈ సందర్భంగా ఆదివారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం వల్ల ప్రజల్లో భక్తిభావాలు పెంపొందుతాయన్నారు. అనంతరం ఆలయ నిర్మాణ దాతలు నంగునూరి శ్రీశారద-అశోక్‌కుమార్‌తోపాటు వారి కుటుంబ సభ్యులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులను మంత్రి ఘనంగా సన్మానించారు.
తర్వాత ఎర్రబెల్లిని సర్పంచ్ గూడెల్లి శ్రీలతా శ్రీనివాస్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు అనంతుల కృష్ణారెడ్డి, బద్దం వేణుగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, నాయకులు పూస మధు, గారె నర్సయ్య, అయిత రాంచందర్, దేదావత్ కమలమ్మ-వెంకన్న, జగన్నాయక్, మద్దెల యాకయ్య, కంది ప్రభాకర్, ముత్తడి సాగర్‌రెడ్డి, చందు రామ్‌యాదవ్, అశ్రఫ్‌పాషా, ఎద్దు రమేశ్, సంకినేని ఎల్లస్వామి పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
పలు బాధిత కుటుంబాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. జగన్నాథపల్లికి చెందిన బద్దం యాకూబ్‌రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా అతడిని పరామర్శించారు. అదేవిధంగా దుబ్బతండాకు చెందిన దేదావత్ రాంచందర్‌నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించారు. తర్వాత కొలన్పల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట నర్సింగం కుమార్తె వివాహానికి మంత్రి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో సమకూర్చిన కానుకలను వారికి అందజేశారు.