హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 3 : స్వరాష్ట్రంలోనే క్రీడా మైదానాలు అభివృద్ధి చెందాయని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుబేదారిలోని ఆఫీసర్స్ క్లబ్లో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యా డ్మింటన్ పోటీలు బుధవారం రాత్రి ము గిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీఫ్‌విప్ మా ట్లాడుతూ తాను క్రీడాకారుడిని కాదని, క్రీడాభిమానినని అన్నారు. 30 ఏళ్ల క్రితం అన్ని గ్రౌండ్లు క్రీడాకారులతో కిటకిటలాడేవన్నారు. క్రమంగా తగ్గిపోయి క్రీడామైదానాలు వెలవెలబోతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడామైదానాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం క్రీడామైదానాలు సందడిగా మారాయన్నారు. ప్రతినెలా ఒక ఈవెంట్ నిర్వహించడంతో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాల్లో అభివృద్ధి చేస్తోందన్నారు. క్రీడాకారుల కోసం ఆధునిక హంగులతో క్రీడామైదానాలను అభివృద్ధి చేసి, నూతనంగా క్రీడాపాలసీ కూడా తీసుకొస్తుందన్నారు. అనంతరం మూడు రోజుల పో టీలను విజయవంతం చేసిన నిర్వాహకులను వినయ్‌భాస్కర్ అభినందించా రు. క్రీడాకారులకు గెలుపోటములు సహజమని, గెలుపు కోసం చివరి వర కూ ప్రయత్నించాలని సూచించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యా డ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎస్ రమేశ్‌కుమార్, డాక్టర్ పీ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్స్‌లో మొత్తం 153 మంది క్రీడాకారులు పాల్గొనగా వారికి ఆరు విభాగాల్లో పోటీల్లో నిర్వహించినట్లు చెప్పా రు. అత్యంత ప్రతిభ చూపి విజేతలుగా నిలిచిన వారికి చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ పతకాలు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఏసీపీ జితేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ మూల జితేందర్‌రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పీ శోభన్‌కుమార్, కోశాధికారి డీ నాగకిషన్, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ నిమ్మ మోహన్‌రావు, వీటీ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ జీ సత్యనారాయణరెడ్డి, టెక్నికల్ ఆఫిషియల్స్ చీఫ్ రెఫరీ కొమ్ము రాజేందర్, శ్యాంకుమార్, మ్యాచ్ కం ట్రోల్ కిశోర్, ప్రసాద్, శ్రీధర్, భాస్కర్, శైలజ, అరుణ్, వెంకటస్వామి, మహేశ్, నాగరాజు, కృష్ణవేణి పాల్గొన్నారు.