మహబూబాబాద్ రూరల్, జూలై 13 : జిల్లావ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనం గా జరిగాయి. ఈ సందర్భంగా సాయినాథుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తజనం తో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్-సీతామహాలక్ష్మి దంపతులు మహబూ బాబాద్‌లోని సాయిబాబా ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశా రు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, టీఆర్ ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, యాళ్ల మురళీధర్‌రెడ్డి, గుండా వెంకన్న, గోగుల వెంక న్న, రఘు, విజయ్, రంగారావు, శరత్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలని వినతి
నర్సింహులపేట, జూలై 13: మండల కేంద్రంలోని జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అఖిల్ మృతికి కారణమైన ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలని కోరుతూ బుధ వారం తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రం అందిం చారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు మధు మాట్లాడుతూ విద్యార్థి మృతి చెంది 10 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వెంటనే సంబంధిత విద్యాశాఖాధికారులు మృతి చెందిన అఖిల్ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కార్య క్రమంలో వెంకటేశ్, నరేశ్, గోపి, మహేశ్, నవీన్ తదితరులు ఉన్నారు.