హనుమకొండ చౌరస్తా, జూలై 10: కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో భాగంగా ఆదివారం హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ టౌన్హాల్లో పెయింటింగ్ వర్క్‌షాపు ఏర్పాటు చేశారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్, మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని, కాకతీయుల చరిత్రపై బొమ్మలను గీసి ఆకట్టుకున్నారు. విద్యార్థులు కాకతీయ ఘనచరిత్రపై గీసిన పలు చిత్రాలను చూసి చాలా బాగున్నాయని ముఖ్యఅతిథులు వారిని అభినందించారు. అలాగే, అక్కడ ఏర్పాటు చేసిన పలు హస్తకళా శిల్పాలను పరిశీలించి అద్భుతంగా ఉన్నాయన్నారు. కార్యక్రమం లో జిల్లా క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు.