వరంగల్, జూలై 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలంలో వరద ముప్పును నివారించే దిశగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళిక రూ పొందించింది. వరదలతో ఎక్కువ నష్టం కలిగించే పెద్ద భవనాలు, అపార్టుమెంట్లలోని పరిస్థితులను పరిశీలిం చింది. సెల్లార్లలో వరద నీరు చేరే ప్రాంతాలను గుర్తిం చింది. వరద నీరు చేరితే వెంటనే తరలించేందుకు అవ సరమైన చర్యలు తీసుకునేలా ఆయా భవనాలు, అపా ర్టుమెంట్లకు నోటీసులు ఇచ్చింది. వరద చేరే అవకాశం ఉన్న నిర్మాణాలు ఎన్ని?, వాటిలో చేరిన నీటిని త్వరగా బయటికి పంపించేందుకు చేయాల్సిన ఏర్పాట్లు ఏమి టనేది నిర్ధారించింది.
సెల్లార్లలో వరద నీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉండాలని సూచించింది. సెల్లార్లలో కరంటు సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉం డాలని పేర్కొన్నది. వరద నీరు చేరినా కరంటు సర ఫరా వ్యవస్థ తడిసిపోకుండా సరైన ఎత్తులో ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇలాంటి వ్యవస్థ లేని నిర్మా ణాల్లో సెల్లార్లలోని నీటిని బయటికి తరలించేందుకు ప్రత్యేకంగా ప్యానెల్ బోర్డులు ఉండాలని పేర్కొన్నది. వరద నీటి నిర్వహణలో ప్రధానమైన మడ్ సంపు (బురద సంపు) ఉండాలని సూచించింది. వరద నీటిని బయటికి పంపించేందుకు ప్రత్యేకంగా మోటర్లు ఉండా లని పేర్కొన్నది. సెల్లార్లలో నీటిని బయటికి పంపించేం దుకు జనరేటర్లు ఉండాలని సూచించింది. ఇవన్నీ ఉంటేనే వరద నీటిని త్వరగా బయటికి తరలించడం వీలవుతుంది.
ముంపు ప్రమాదం..
వరంగల్ మహానగరం పరిధిలో 134 భవనాలు, అపార్టుమెంట్లకు వరద ముంపు అవకాశం ఉన్నదని జీడబ్ల్యూఎంసీ గుర్తించింది. వరద నీటి నిర్వహణలో వీటిలో అధిక శాతం భవనాలు, అపార్టుమెంట్లు అధ్వానంగానే ఉన్నాయి. వానలతో వచ్చే వరద నీటిని త్వరగా ఖాళీ చేయించే ఏర్పాట్లు ఈ నిర్మాణాల్లో లేవని జీడబ్ల్యూఎంసీ గుర్తించింది. ఇప్పటికైనా వెంటనే ఈ ఏర్పాట్లు చేయాలని ఆయా భవనాలు, అపార్టుమెంట్ల వారికి ఆదేశాలు ఇచ్చింది. వరద ముంపు ప్రమాదం ఉన్న భవనాలు, అపార్టుమెంట్లను పరిశీలించి సమస్య నివారణకు సూచనలు చేసింది. నివేదిక రూపొందిం చింది.
జీడబ్లూఎంసీ గుర్తించిన అపార్టుమెంట్లు, భవ నాల్లో ప్యానెల్ బోర్డులు సరిగా ఉన్న సెల్లార్లు 42 మా త్రమే ఉన్నాయి. బురద నీటి నిర్వహణ కోసం అవస రమైన మడ్ సంప్ 78 సెల్లార్లలోనే ఉన్నాయి. వరద నీటిని బయటికి తరలించేందుకు అవరమైన మోటర్లు 85 సెల్లార్లలోనే ఉన్నాయి. 38 సెల్లార్లలోనే వరద నీటిని తరలించే మోటర్లకు జనరేటర్ సౌకర్యం ఉన్నది. ముంపు అవకాశం ఉన్న భవనాలు, అపార్టుమెంట్లో ఎక్కువ శాతం వరద నీటి నిర్వహణ సౌకర్యాలు లేక పోవడం ఆందోళన కలిగిస్తున్నది.
గ్రేటర్ వరంగల్‌లో వరద ముంపు
అవకాశం ఉన్న భవనాలు, అపార్టుమెంట్లు: 134
ప్యానెల్ బోర్డులు సమస్య ఉన్నవి: 92
మడ్ సంప్ లేనివి: 56
వరద నీటి పంపుసెట్ లేనివి: 49
పంపు సెట్‌కు జనరేటర్ లేనివి: 96