నెక్కొండ/చెన్నారావుపేట/దుగ్గొండి/నర్సంపేట/నర్సంపేటరూరల్, జూన్ 18: సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఖానాపురం మండలానికి చెందిన దామెర రాకేశ్ మృతి చెందాడు. ఈ మేరకు సంతాప సూచకంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపుమేరకు నర్సంపేట నియోజకవర్గంలో శనివారం చేపట్టిన విజయవంతమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నెక్కొండలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య ఆధ్వర్యంలో పాఠశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వంచ్ఛందగా బంద్ పాటించాయి. కార్యక్రమంలో జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, సీనియర్ నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, గుంటుక సోమయ్య, తాటిపెల్లి శివకుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, ఉప సర్పంచ్ వీరభద్రయ్య, రామాలయ కమిటీ చైర్మన్ సత్యం, మాజీ ఎంపీపీ చంద్రయ్య, నాయకులు నరేందర్‌రెడ్డి, సారంగపాణి, భాస్కర్‌రెడ్డి, కృష్ణారావు, వినయ్‌రెడ్డి, కనకయ్య, రాజు, విజేందర్, అశోక్, కస్నాతండా సర్పంచ్ రవి పాల్గొన్నారు. చెన్నారావుపేటలో బంద్ సంపూర్ణమైంది.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, యువకులు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాకేశ్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తినాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, టీఆర్ఎస్ మండల ఆధ్యక్షుడు బాల్నె వెంకన్న, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, సర్పంచ్ కుండె మల్లయ్య, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, నాయకులు కృష్ణచైతన్య, మహేందర్‌రెడ్డి, తూటి శ్రీను, కుసుమ నరేందర్, శ్రీధర్‌రెడ్డి, కుమారస్వామి, రాంబాబు పాల్గొన్నారు. దుగ్గొండి మండలవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్, సీపీఎం, ఎంసీపీఐ ఆధర్వంలో ర్యాలీలు నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గిర్నిబావిలో దుగ్గొండి రూరల్ సీఐ సూర్యప్రసాద్, ఎస్సై నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, నాయకులు పాల్గొన్నారు. నర్సంపేటలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను సీపీఐ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేశ్ మాట్లాడుతూ రాకేశ్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాకేశ్ అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు మియాపురం గోవర్ధన్, గడ్డం యాకయ్య, బానోత్ వీరూనాయక్, యాకూబ్‌పాషా, పాల కవిత, బాదర యాదగిరి, కమ్మల సొమ్ములు, సతీశ్, మంజుల, మమత పాల్గొన్నారు. నర్సంపేట మండలంలో బంద్ విజయవంతమైంది. వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బంద్‌లో పాల్గొనేలా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చర్యలు తీసుకున్నారు. టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి..
గీసుగొండ: పోలీసుల కాల్పులో మృతి చెందిన దామెర రాకేశ్ మృతికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏఐఎఫ్డీఎస్ జిల్లా అధ్యక్షుడు సాయిరాంవర్ష అన్నారు. గీసుగొండ క్రాస్‌రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎంసీపీఐయూ అధ్వర్యంలో మచ్చాపురం క్రాస్‌రోడ్డు వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి మాట్లాడుతూ రాకేశ్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియాతోపాటు కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎఫ్డీఎస్ నాయకులు వంశీ, ఇమ్రాన్, సాయితేజ, రాకేశ్, సందీప్, ఎంసీపీఐయూ నాయకులు కందికొండ కుమారస్వామి, చాపర్తి కుమార్, కొమురెల్లి, సాయిరాం, బుచ్చయ్య, వీర్ల బుచ్చయ్య, ఆదినారాయణ, రాజయ్య పాల్గొన్నారు.