స్టేషన్ ఘన్పూర్, జూన్ 18 : దేశానికి అన్నం పెట్టే రైతులను, ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న జవానులను మనం ఘనంగా జై జవాన్, జై కిసాన్ అంటుంటే మోదీ మాత్రం నై జవాన్, నై కిసాన్ నినాదం తీసుకువచ్చారని ఎమ్మెల్యే రాజయ్య అన్నా రు. శనివారం డివిజన్ కేంద్రంలోని పంచాయతీ ముం దు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్ అధ్యక్షతన నరేంద్ర మోదీ తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిర్వహించిన అల్లర్లలో దామెర రాకేశ్ మృతికి నిరసనగా ధర్నా నిర్వహించి, మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ య్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ య్య మాట్లాడుతూ అగ్నిపథ్ ద్వారా ఆర్మిలో చేరిన వారిలో 75 శాతం జవాన్లను నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించిన వారికి ఎలాంటి పెన్షన్లు కానీ, రాయితీలు కానీ రావని ఆయన అన్నారు.
ఈ పథకం ద్వారా ఆర్మిలో చేరే వారికి ఉద్యోగ భద్రత లేదన్నారు. అగ్నిపథ్ పథకంను వ్యతిరేకిస్తున్న వారిపై సీఆర్పీఎఫ్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిందన్నారు. నిరసన కారులపై బాష్పవాయువు ప్రయోగించిందని, కాల్పులు కూడా జరుపడంతో నర్సంపేటకు చెందిన దామేర రాకేశ్ మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. సికీంద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.25 లక్షలతో పాటు అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ను రద్దు చేసేవరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖా గట్టయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తాటికొండ సురేశ్, నియోజకవర్గ ఆఫీస్ ఇన్చార్జి ఆకుల కుమార్, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, సింగపురం దయాకర్, గుర్రం రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ తోట సత్యం, పట్టణ అధ్యక్షుడు మునిగెల రాజు, దిశ కమిటీ మెంబర్ మాలోత్ రమేశ్ నాయక్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కందుల గట్టయ్య, ఉప సర్పంచ్ మారపాక రాములు, మారపల్లి ప్రసాద్, గుండె మల్లేశ్, ఆకారపు అశోక్, స్టేషన్ ఘన్పూర్ మండల వర్కింగ్ ప్రసిడెంట్ బొల్లు లక్ష్మి, మండల మహిళా కోశాధికారి కుందూరు జ్యోతి రెడ్డి, మండల మహిళా అధికార ప్రతినిధి పావని, మండల మహిళా ప్రచార కార్యదర్శి మౌనిక, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.