గీసుగొండ/చెన్నారావుపేట/పర్వతగిరి/నల్లబెల్లి, జూన్ 14: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని డీఈవో వాసంతి సూచించారు. గీసుగొండ మండలంలోని గీసుగొండ, మనుగొండ జడ్పీహెచ్ఎస్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికతోపాటు బడిబాటలో విద్యార్థుల నమోదును అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను ఉపాధ్యాయులు వెలికి తీయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోత్స్న ప్రభ, దయాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలంలోని చెన్నారావుపేట, పాపయ్యపేట, అమృతండా, కోనాపురం, లింగాపురం పాఠశాలల్లో మనఊరు-మనబడి అభివృద్ధి పనులను నోడల్ అధికారి సృజన్తేజ పరిశీలించారు.
బడిబాటలో విద్యార్థుల సంఖ్యను అధికంగా పెంచాలని సూచించారు. హెచ్ఎంలు కిరణ్కుమార్, కుమారస్వామి, మల్లయ్య, ఆంజనేయులు, రవీందర్, ఎస్ఎంసీ చైర్మన్లు యాకూబ్, విఠల్, రవీందర్, సీఆర్పీలు సంపత్, బాలు, స్వామి పాల్గొన్నారు. పర్వతగిరి మండలం ఏనుగల్, అన్నారం షరీఫ్, చౌటపెల్లిలో ప్రాథమిక పాఠశాలలను అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ ఆకస్మికంగా సందర్శించారు. స్కూళ్లలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నల్లబెల్లి మండలంలోని వేదనగర్, నాగరాజుపల్లె, మామిండ్లవీరయ్యపల్లె బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి చర్యలు చేటట్టిందన్నారు. వేదనగర్ సర్పంచ్ కరివేదుల వెంకట్రెడ్డి, టీచర్లు కందుల గోవర్ధన్, రమేశ్, నీలిమ, అరుణాదేవి, విజయలక్ష్మి, గోవర్ధన్, పుష్పలత, ఉరిమల, యాదగిరి, ఎస్ఎంసీ చైర్మన్ రవి దితరులు పాల్గొన్నారు.