గిర్మాజీపేట/కరీమాబాద్/ఖిలావరంగల్/పోచమ్మమైదాన్/మట్టెవాడ, జూన్ 11: పట్టణ ప్రగతి కార్యక్రమంతో సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటిస్తూ సమస్యలను గుర్తిస్తున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం 25వ డివిజన్లో టీఆర్ఎస్ డివిజన్ నాయకుడు బస్వరాజ్ శ్రీమాన్ ఆధ్వర్యంలో నోబుల్ ఫంక్షన్‌హాల్ గల్లీ నుంచి మండిబజార్ వద్ద చేపట్టిన పనులను పరిశీలించారు.
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. మస్తాన్, బండారి సదానందం, సిరిబోయిన సదానందం, జన్ను శ్యామ్, శ్రీను, తరుణ్, మున్సిపల్ అధికారులు, డివిజన్ కమిటీ సభ్యులు, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే, 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో పెరుకవాడలోని ఓహెచ్ఎస్ఆర్ వాటర్‌ట్యాంక్‌ను క్లోరినేషన్ చేశారు. అలాగే, కార్పొరేటర్ సమక్షంలో అంగన్వాడీ టీచర్లు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. 32, 39, 40వ డివిజన్లో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి పర్యటించారు. 37వ డివిజన్ మధ్యకోటను కార్పొరేటర్ బోగి సువర్ణా సురేశ్, నోడల్ ఆఫీసర్ కేడల కృష్ణమూర్తి సందర్శించారు. చిల్డ్రన్స్ పార్కు ప్రహరీ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో నాయకులు మోయిన్, అదిల్, సలీం, సయ్యద్ అలీ, ఆర్పీలు పర్వీన్, రాజమణి, కల్పన పాల్గొన్నారు. వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేట ఫస్ట్ బొడ్రాయి ఏరియాలో కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ ఆధ్వర్యంలో సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. 13వ డివిజన్లో కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద డ్రైనేజీ పనులను ప్రారంభించారు. చెరువులో వ్యర్థాలను తీయించారు. 21వ డివిజన్లో కార్పొరేటర్ పుర్ఖాన్, 22వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్ 24వ డివిజన్లో పాటక్ మహల్, ఉప్పులవాడ, జక్కుల శ్రీధర్ గల్లీలో పర్యటించారు. కార్పొరేటర్ ఆకుతోట తేజస్వి-శిరీష్ పారిశుధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్ వినయ్, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, ఆర్పీలు పాల్గొన్నారు.
ప్రజలు వ్యాధుల బారిన పడొద్దు
నర్సంపేట/వర్ధన్నపేట: ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. నర్సంపేటలో ఆమె పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. పరిసరాల్లో ఉన్న గుంతలను పూడ్చి వేయాలని కోరారు. వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. తాగునీటి పైపులైన్ల లీకేజీలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకటరెడ్డి, కమిషనర్ నాయిని వెంకటస్వామి, కౌన్సిలర్లు దేవోజు తిరుమల, జుర్రు రాజు, కవిత, రాంబాబు, శ్రీదేవి, రాజు, రజిత, దుశ్యంత్‌రెడ్డి, ఎన్ పద్మ, వీ పద్మ, గోల్య, ఇందిర, రమాదేవి పాల్గొన్నారు. వర్ధన్నపేటలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ పర్యటించారు. పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచితే గృహాలు, వ్యాపార సంస్థల యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చెత్తను మున్సిపల్ సిబ్బందికే అందించాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.