వరంగల్, జూన్ 3: తొలి రోజు 11, 29వ డివిజన్లలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కమి షనర్ ప్రావీణ్య పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నా రు. 28 డివిజన్లో మేయర్, 25వ డివిజన్లో అధికారులు వినతలు స్వీకరించారు. మొత్తంగా నాలుగు డివిజన్లలో మ హిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ ప్రగతికి విచ్చేసి న ప్రజాప్రతినిధులకు కాలనీ సమస్యలను వినిపించారు. క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లి సమస్యలను చూపించారు. పట్ట ణ ప్రగతి కార్యక్రమంలో నేరుగా డివిజన్ ప్రజలతో మాట్లా డించారు. స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. అప్పటిక ప్పుడే పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు చెప్పిన సమస్యలను చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రత్యేకంగా నోట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా దాస్యం మాట్లాతూ నగర ప్రజల మెరుగైన జీవన విధానానికి పట్టణ ప్రగతి పునాది లాంటిదని అన్నారు. పట్టణాలు అభి వృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి ద్వా రా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ప్రజల భా గస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్ర జాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నగ ర ప్రజల జీవన విధానం మెరుగపడేలా చూడాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని వినియోగించుకోని ప్రజలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ గ్రేటర్ కార్పొరేష న్ పరిధిలో ఆదనంగా బస్తీ దవాఖానలు తీసుకువస్తానని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకపో యానని అన్నారు. 29వ డివిజన్లో బస్తీ దవాఖనా ఏర్పా టు చేస్తానని అన్నారు.
డివిజన్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. కమ్యూనిటీ హాల్, పైన్‌లైన్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపా రు. పట్టణ ప్రగతితో పట్టణాల అభివృద్ధికి బాటలు పడుతు న్నాయని అన్నారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ నగ రంలో 15 రోజుల పాటు జరిగే పట్ణణ ప్రగతి కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి డివిజ న్కు ప్రత్యేక అధికారిని నియమించామని, ప్రజలు పట్టణ ప్రగతిలో భాగస్వాములై సమస్యలను ఆయన దృష్టికి తీసు కురావాలని అన్నారు. చిన్న చిన్న సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరిస్తామని, పెద్ద సమస్యలు ఉంటే నెల రోజుల్లో పరిష్క రించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పట్టణ ప్రగతి తొలి రోజు 11, 29 డివిజన్లలో రూ.2 కోట్ల అంచనాల అభివృద్ధి పనులకు చీఫ్ విప్ దాస్యం వినయ్భా స్కర్, మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య శంకుస్థాపన చేశారు. 29వ డివిజన్లో రూ. కోటి ముప్పై లక్షలతో డ్రైనేజీ, 11వ డివిజన్లో రూ. 60 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డివిజన్లలో గత మూడు విడుతల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
కల్యాణలక్ష్మి లబ్ధిదారుల్లో ఆనందం
పట్టణ ప్రగతి కార్యక్రమంలో 11,29 డివిజన్లలో సుమా రు 25 మంది లబ్ధిదారులకు చీఫ్ విప్, మేయర్ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. వీటితోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని లబ్ధిదారులకు అందచేశారు. లక్షా నూట పదహారు రూపాయల చెక్కును అందుకున్న లబ్ధిదారుల కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి.