పరకాల, జూన్ 3: అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం హనుమ కొండలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గం లోని 40 మంది లబ్ధిదారులకు రూ.16.5 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ధర్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అత్యవసర సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి అండగా నిలువాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎక్కువ మొత్తంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తున్నారని అ న్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, ఆయన పాలనలో అన్ని వర్గా ల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద కొడుకుగా తోడుగా ఉంటున్నాడని అన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.