బచ్చన్నపేట, జూన్ 3 : సబ్బండ వర్గాల సంక్షేమంతో పాటు పల్లెల్లో చదువుకుంటున్న విద్యార్థులు, యువకులు సైతం క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లెపల్లెకో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పోచన్నపేట, లక్ష్మాపూర్, కేశిరెడ్డిపల్లి గ్రామాల్లో రూ. 15 లక్షలతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. తొలుత లక్ష్మాపూర్, పోచన్నపేటలోని క్రీడా ప్రాంగణాలను ముత్తిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిన తెలంగాణ సర్కార్ యువత, విద్యార్థుల కోసం పల్లెకో క్రీడా ప్రాంగణం ఏర్పాటుచేస్తున్నదన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతూ నిధులు కేటాయించకున్నా సీఎం కేసీఆర్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి పాటుపడుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్, కాంగ్రేస్ నేత రేవంత్‌రెడ్డి తెలంగాణకు వచ్చే నిధులు తెప్పించడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలని చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి నిధులు తెప్పించాలని సవాల్ విసిరారు.
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు గట్టు మంజులామల్లేశం, నూకల నవ్యానర్సిరెడ్డి, ఎంపీటీసీలు మామిడి అరుణ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జడ్పీవైస్చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, ఎంపీడీవో రఘురామకృష్ణ, మండల ప్రత్యేకాధికారి వినోద్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్, సంతోష్, వైస్ ఎంపీపీ అనిల్‌రెడ్డి, నాయకులు అంజయ్య, కృష్ణంరాజు, నర్సిరెడ్డి,రాజనర్సు, ఫిరోజ్, మహేందర్‌రెడ్డి, బాలకృష్ణ, భాస్కర్, షాబొద్దీన్, బొట్టు సుధాకర్, లక్ష్మణ్, రాములు, రాధ, రంగారెడ్డి, బాలచందర్, రవీందర్‌రెడ్డి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి, జూన్ 3: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రా జయ్య అన్నారు. మండలంలోని కంచనపల్లి, ఎల్లారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలను ఎంపీపీ మేకల వరలక్ష్మి, ఎంపీడీవో హసీం కలిసి శుక్రవారం ఆయన పారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య క్రీడా మైదానంలో మొక్కలు నాటి ఖోఖో, వాలీబాల్, కబడ్డీ ఆటలు ఆడి ఉత్సాహపర్చారు. అనంతరం సర్పంచ్ గవ్వాని విజయ-నాగేశ్వర్రావు అధ్యక్ష తన జరిగిన సమావేశంలో రాజయ్య మాట్లాడారు. నేటి యువత సన్మార్గంలో పయనించేలా చదువుతోపాటు ఆటలపై దృష్టి సారించాలని కోరారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ నియామకాల్లో అవకాశాలు ఉంటాయని, దీనిని క్రీడాకారులు వినియోగించుకోవాలని రాజ య్య కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వారాల రమేశ్‌యాదవ్, కార్యదర్శి ముసిపట్ల విజయ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గొరిగె రవి, ఎంపీటీసీ సభ్యులు కేమిడి రమ్యరాజు, దొనికెల రమాదేవి, మడికంటి మధు పాల్గొన్నారు.