మరిపెడ, జూన్2 : మరిపెడ మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ‘దళితబంధు’ జాతర కొనసాగింది. మండలంలోని విస్సంపల్లి, బీచురాజుపల్లి, ఎల్లారిగూడేనికి చెందిన 100మందికి ట్రాక్టర్, జేసీబీ, వివిధ ట్రాన్స్పోర్ట్ వాహనాలను ఎమ్మెల్యే రెడ్యానాయక్ పంపిణీ చేయగా లబ్ధిదారుల్లో సంబురం రెట్టించింది. ఎమ్మెల్యే రెడ్యా ఆధ్వర్యంలో యూనిట్లు పొందిన లబ్ధిదారుల కుటుంబాల్లో బతుకుపై భరోసా నిం డింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశానికే దిక్సూచి అని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ పథకం తెచ్చారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దశాబ్దాలుగా సామాజికంగా, రాజకీయంగా వివక్షకు గురైన వర్గాల ఉద్ధరణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధును తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. తొలివిడుత నియోజకవర్గానికి రూ.10కోట్లతో వంద యూనిట్లు అందించామని చెప్పారు. దేశ రాజకీయ చరిత్రలో దళితుల అభ్యున్నతికి ఈ స్థాయిలో కృషి చేసిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టం చేశారు. సమైక్యరాష్ట్రంలో పొట్టచేత పట్టుకొని వలస వెళ్లిన పలు చేతివృత్తులవారు నేడు పల్లెల్లో దర్జాగా ఉపాధి పొందుతున్నారన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలో 1500 మందికి అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పాలేర్లు, గుమాస్తాలు, కార్మికులు, డ్రైవర్లుగా కాలం వెళ్లదీస్తున్న దళితులను ఈ పథకం ద్వారా యజమానులను చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు
దళితబంధు ద్వారా రూ.30లక్షలతో ముగ్గురం కలిసి జేసీబీ కొ న్నం. మమ్ములను గతంలో ఏ ప్ర భుత్వం కూడా పట్టించుకున్న పా పాన పోలేదు. కేవ లం దళితులను ఓట్ల కోసమే వాడుకున్న రు. తెలంగాణ వచ్చాకే సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నా రు. మాకు కొత్త జీవితాలనిచ్చిన ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
-నగేశ్, చిదుమూల ఎల్లయ్య, మారిపట్ల వెంకన్న, లబ్ధిదారులు, బీచురాజుపల్లి
ముగ్గురం కలిసి జేసీబీ కొన్నం
దళితబంధు పథకం మా కుటుంబాల్లో వెలుగులు నింపింది. ముగ్గురం కలిసి మాకు మంజూరైన యూనిట్ల డబ్బులు రూ.30లక్షలతో జేసీబీ కొన్నం. ఇన్ని రోజులు కూ లీలు, డ్రైవర్లుగా పనిచేసినం. సీఎంకేసీఆర్ సార్ దయతో ఓనర్లమైనం. కేసీఆర్ సారు ప్రభుత్వం పదికాలాలపాటు సల్లగుండాలె.
– బల్లెం ధర్మయ్య, రామన్న, వెంకన్న, బీచురాజుపల్లి
డోజర్ కొనుక్కున్న..
దళితబంధు పథకం నా కుటుంబానికి దారి చూపింది. ప్రభుత్వం ఇచ్చిన రూ.10లక్షలతో ట్రాక్టర్ డోజర్ కొన్న. డ్రైవర్గా పని చేసిన నన్ను యజమానిని చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. మా గ్రామంలో 80 కుటుంబాలకు దళితబంధు పథకం ద్వారా లబ్ధి చేకూరింది.
– పుల్లూరి బాలకృష్ణ, విస్సంపల్లి