వరంగల్, జూన్ 1(నమస్తేతెలంగాణ) : గ్రామీణ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడంతో పాటు వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆయా గ్రామాలు, వార్డుల్లో గుర్తించిన స్థలా ల్లో క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు. గ్రౌండ్‌ను చదును చేసి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, బ్యా డ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. లాంగ్‌జంప్, హైజంప్ ప్లాట్‌ఫామ్‌లను, వ్యాయామం కోసం బార్లను తీర్చిదిద్దుతున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై ఈ నెల 18న హైదరాబాద్‌లో సీఎం కే చంద్రశేఖర్‌రావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో అనేక అంశాలపై చర్చించిన ఆయన ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పా టు చేయాలని, జూన్ 2న ప్రతి మండలంలో రెండింటిని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జీపీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ప్రాం గణాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామ పంచాయతీకి ఒకటి గాకుం డా దాని పరిధిలోని ప్రతి హ్యాబిటేషన్‌కు ఒకటి చొప్పు న ఏర్పాటు చేయాలని పేర్కొంది. మున్సిపాలిటీల పరిధిలో వార్డుకు ఒకటి, నగర పాలక సంస్థల పరిధిలో డివిజన్‌కు ఒకటి లెక్కన నెలకొల్పాలని సూచించింది. మొదట ప్రతి మండలంలో రెండు నుంచి మూడు, మున్సిపాలిటీ పరిధిలో ఒకటి నుంచి రెండు క్రీడా ప్రాంగణాలను జూన్ 2న ప్రారంభించేందుకు ఏర్పా ట్లు చేయాలని స్పష్టం చేసింది. దీంతో ఇటీవల కలెక్టర్ బీ గోపి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాల గుర్తింపు, క్రీడల నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.
చురుగ్గా పనులు..
ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రంగంలోకి దిగారు. అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో పడ్డారు. గ్రామం, వార్డు మధ్యన లేదా సమీపంలో కనీసం ఒక ఎకరం స్థలం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ నిధులు, మున్సిపాలిటీల పరిధిలో జనరల్ ఫండ్ లేదా పట్టణ ప్రగతి నిధులతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పనులు చేపట్టారు. గుర్తించిన స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించి మొరంతో గ్రౌండ్‌ను చదు ను చేశారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, షటిల్ కోర్టులను ఒక్కొకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి క్రీడా ప్రాంగణంలో లాంగ్‌జంప్, హైజం ప్ ప్లాట్‌ఫామ్‌లను, ఎక్సర్సైజ్ కోసం రెండు బార్లను నిర్మిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి అధికారులు కొద్ది రోజుల నుంచి క్రీడా ప్రాంగణాలను రెడీ చేసే పనుల్లో తలమునకలయ్యారు. జిల్లాలో పదకొండు మండలాల్లో 23, రెండు మున్సిపాలిటీల పరిధిలో 3 క్రీడా ప్రాంగణాలను జూన్ 2న ప్రారంభించేందుకు తీర్చిదిద్దుతున్నారు. ప్రతి క్రీడా ప్రాంగణానికి గేటుతో పాటు నేమ్ బోర్డును ఏర్పాటు చేసే పనులు కూడా చేపట్టారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సమీపించడంతో పనుల్లో వేగం పెంచారు. అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం సంపత్‌రావుతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సూచనలు చేసి పనుల్లో స్పీడ్ పెంచుతున్నారు.
ప్రారంభించేవి ఎక్కడంటే..
చెన్నారావుపేట మండలంలో ఖాదర్‌పేట, కోనాపూర్, దుగ్గొండి మండలంలో తిమ్మంపేట, దేశాయిపల్లి, గీసుగొండ మండలంలో కోనాయిమాకుల, ఎలుకుర్తి, ఖానాపురం మండలంలో రంగాపూర్, మనుబోతులగడ్డ, రాగంపేట, నర్సంపేట మండలంలో మాదన్నపేట, రాజుపల్లి, నల్లబెల్లి మండలంలో బచ్చిరెడ్డిపల్లె, మూడుచెక్కలపల్లి, నెక్కొండ మండలంలో దీక్షకుంట, తోపనపల్లి, పర్వతగిరి మండలంలో చింతనెక్కొండ, జమాల్‌పురం, రాయపర్తి మండలంలో తిర్మలాయప ల్లి, రాయపర్తి, సంగెం మండలంలో గవిచర్ల, రామచంద్రాపురం, వర్ధన్నపేట మండలంలో ల్యాబర్తి, రామవ రం గ్రామాల్లో టీజీకేపీలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఒక్కో క్రీడా ప్రాంగణాన్ని ఎక రం స్థలంలో తీర్చిదిద్దుతున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఒకటి చొప్పున క్రీడా ప్రాంగణాలను రెడీ చేస్తున్నారు. నర్సంపేటలో ఒకటి మినీ స్టేడియంలో, మరొకటి ఎంపీడీవో కార్యాలయం సమీపంలో మున్సిపల్ అధికారులు క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నారు. ఇక్క డ 24 వార్డులు ఉండగా రెండు వార్డుల్లో ఒక్కోటి చొ ప్పున రెండు క్రీడా ప్రాంగణాలు ప్రారంభానికి ముస్తా బు అవుతున్నాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉండగా, ఇక్కడ 8వ వార్డులో గల బతుకమ్మ గ్రౌండ్లో మున్సిపల్ అధికారులు క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఈ పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. దుగ్గొం డి మండలంలోని తిమ్మంపేట, దేశాయిపల్లి గ్రామాల్లో మినహా ఇతర మండలాల్లోని 21 గ్రామాల్లో, నర్సంపేట, వర్ధన్నపేటలోని మూడు మూడు వార్డుల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. జూ న్ 2న ఈ గ్రామాలు, వార్డుల్లో క్రీడా ప్రాంగణాల ప్రా రంభానికి అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
హ్యాబిటేషన్కో క్రీడా ప్రాంగణం..
– ఎం సంపత్‌రావు, డీఆర్డీవో, వరంగల్
జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 576 హ్యాబిటేషన్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో హ్యాబిటేషన్కో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. ప్రతి హ్యాబిటేషన్‌లో ఒక ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణం నెలకొల్పే దిశగా ముందు కు వెళ్తున్నాం. ఇప్పటికే స్థలాలను గుర్తిస్తున్నాం. ప్రస్తుతం జూన్ 2న ప్రారంభించేందుకు పదకొండు మండలాల్లోని 23 గ్రామాల్లో గుర్తించిన స్థలాల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు చేపట్టాం. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. లాంగ్‌జంప్, హైజంప్ ప్లాట్‌ఫామ్స్, వ్యాయామం కోసం బార్లను నిర్మిస్తున్నాం. ఈ పనులన్నీ చివరి దశకు చేరాయి.