రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని హనుమకొండలోని పరేడ్ గ్రౌండ్లో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై గురువారం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ఆయన జిల్లా అభివృద్ధిపై ప్రసంగించి, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్ స్టాళ్లను సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో కవి సమ్మేళనం నిర్వహిస్తారు. వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
హనుమకొండ, జూన్ 1 : రాష్ట్ర అవతరణ వేడుకలను గురువారం ఘనంగా నిర్వ హించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలు, ఆచారాలను ప్రతిబింబించే విధంగా ప్రద ర్శనలు ఉంటాయి. వేడుకల సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్, కలెక్టర్ బంగ్లాతో పాటు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను ముస్తాబు చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగ నున్న ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 8.40 గంటలకు అదాలత్ సెంటర్లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి జిల్లా అభివృద్ధి గురించి ప్రసంగిస్తారు. అలాగే, పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేసి, స్వాతంత్య్ర సమరయోధుల ను సత్కరిస్తారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్ స్టాళ్లను సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు, కవులు కళాకారులు హాజరవుతారు.
ముస్తాబైన నగరం
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు చారిత్రక ఓరుగల్లు నగరం ముస్తాబైంది. నగర ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వేడుకల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.
‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో నలుగురికి జైలు
కాజీపేట : మద్యం తాగి వాహనాలు నడపిన నలుగురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బుధవారం జైలు శిక్ష విధించినట్లు కాజీపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు. మరో 34 మందికి రూ.43,400 జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు. జైలు శిక్ష పడిని వారిని పరకాల సబ్‌జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
9 మందికి జరిమానా
హనుమకొండ చౌరస్తా : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 9 మందికి సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప్ప రూ.13,900 జరిమానా విధించినట్లు హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ టీ రవికుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడుపొద్దని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సూచించారు.