మహబూబాబాద్, జూన్1: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమా ల్ని విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రగతి సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్ శశాంక, అధికారులతో కలిసి 5వ విడుత పల్లె ప్రగతి, 4వ విడుత పట్టణ ప్రగతి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి అద్భుతంగా జరగుతున్నదన్నారు. ఈ నెల 3 నుంచి 18 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి కృషి అవసరమన్నారు.
కేంద్రప్రభుత్వం అనేక నిబంధనలు మార్చడంతో రాష్ర్టానికి రావాల్సిన ఉపాధి హామీ డబ్బులు రాలేదన్నారు. గ్రామాల్లో ని సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ డబ్బులు రెండు, మూడు రోజుల్లో వారి అకౌంట్లలో జమవుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా నిర్వహించాలని కోరారు.ఇందుకోసం ప్రత్యేకాధికారులను నియమించామన్నారు. వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లను వాడకంలోకి తీసుకురావాలన్నారు. ట్రాక్టర్లు, సెగ్రిగేషన్‌లో తయారైన ఎరువుల అమ్మకం ద్వారా ఆదాయం పెంచాలని సూచించారు. వార్డు, గ్రామపంచాయతీలో అభివృద్ధి వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి పనుల కోసం పూర్తిగా సన్నద్ధమయ్యామని అన్నా రు.
జిల్లాలో చేపట్టిన పనులను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు పల్లె, పట్టణాలు అభివృద్ధి చెందేలా అధికారులు పనిచేయాలన్నా రు. అనంతరం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమా లకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. రోజు వారీ కార్యాచరణ ఎలా చేయాలో సూచ నలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్, మున్సిపల్ చైర్మన్ పాల్వా యి రామ్మోహన్‌రెడ్డి, జడ్పీ సీఈవో రమాదేవి, డీపీఓ సాయిబాబా, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ, మిషన్ భగీరథ గ్రిడ్ ఇంట్రా ఈఈ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీ డీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.