కురవి, జూన్1: టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే పేద ల ప్రభుత్వమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. తర్వాత అనే రీతిలో అభివృద్ధిని చూ డాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మండలంలోని తట్టుపల్లి గ్రామంలో 30 డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం ప్రారంభించి, పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రజలు పూలు చల్లి, డీజేలతో ఘనంగా స్వాగతం పలికారు. అదేవిధంగా నేరడ గ్రామంలో 30 ఇండ్లకు, మన ఊరు-మన బడి కింద ప్రాథమిక పాఠశాలకు రూ. 36 లక్షలతో మంజూరైన పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 30 లక్షలతో నేరడలో, మేగ్యా, మంచ్యా, భద్రు, భీమ్లా, బాల్య తండాల్లో రూ. 9 లక్షలు, 12 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.
మేగ్యా, ఎలుకచెట్టు తండాల్లో రూ. 7 లక్షలు, రూ. 2 లక్షలతో సైడ్ కాల్వలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ నిత్యం పేదల కోసం కష్టపడే సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అన్నారు. ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణానికి రూ. ఐదు లక్షలు ఇస్తోందని, అందులో కూడా జీఎస్టీ పేరుతో కేంద్రం రూ. 75 వేల పన్ను విధిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఓటడిగే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, డోర్నకల్ నియోజకవ ర్గంలో తనకే ఉందన్నారు. తాను కూడా హైదరా బాద్‌లో ఉండొచ్చని, సేవ చేసే భాగ్యం కల్పించిన మీకు నిత్యం అందుబాటులో ఉండాలని తండా లోనే ఉంటున్నానని తెలిపారు.
నియోజకవర్గం లో ప్రతి తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాన న్నారు. కేసీఆర్ తీసుకువచ్చిన ప్రతి పథకం దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. పీఎం నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో మిషన్ భగీరథ లేదు.. కరంటు కష్టాలు తప్ప డం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్‌వన్ స్థానానికి రాష్ర్టానికి తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్కు మద్దతుగా నిలబడా లన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పార్టీలకు భవి ష్యత్ ఉండదని ప్రతిపక్షాలు లేనిపోనివి మాట్లాడు తారన్నారు. తట్టుపల్లి సర్పంచ్ రాంరెడ్డి కోరిక మేరకు దసరా నాటికి నూతన ఇండ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ గుగు లోత్ పద్మావతి, మహబూబాబాద్ వ్యవసాయ మార్కె ట్ చైర్మన్ బజ్జూరి ఉమ, జిల్లా నాయకుడు బజ్జూరి పిచ్చిరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ గుగులోత్ రవి, సొసైటీ చైర్మన్లు దొడ్డ గోవర్ధన్‌రెడ్డి, గార్లపాటి వెంకట్‌రెడ్డి, ఆలయ చైర్మన్ బదావత్ రామూనాయక్, ఆలయ మాజీ చైర్మన్ రాజూనాయక్, ఎంపీటీసీ పోతుగంటి వెంకన్న, సర్పంచ్‌లు అమ్రీబాయి, భూక్యా మం గీలాల్, మట్ట చిన్న సైదులు, మల్లెపాక మధు, మాలో త్ రమేశ్, కొత్త సైదులు, లునావత్ వీరన్న, గుగులోత్ కిషన్, బాలు, వీరన్న, శ్రీను, బాలు, బానోత్ రాజు, రంగన్న, వీరన్న, గుగులోత్ వీరన్న, ఉపేందర్, భూ క్యా రమేశ్, శ్రీను, చింగ్యానాయక్, వెంకన్న, బీ వెంక న్న, రవికుమార్, చంద్రశేఖర్, జాటోత్ కొండయ్య, ఈశ్వరి, బాలు, ధర్మా, నేరడ ఉపసర్పంచ్ హేమంత్, కలకోట రమణ, నూకల అనిల్, రవీందర్, కృష్ణారెడ్డి, సంకూరి వీరన్న, పోతుగంటి సైదులు పాల్గొన్నారు.