నల్లబెల్లి, మే 31: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పల్లెప్రగతి కార్యక్రమం దోహదం చేస్తున్నదని జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంపై మంగళవారం సన్నాహక సమావేశాన్ని ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పెద్ది స్వప్న హాజరై మాట్లాడారు. ఈ నెల 3వ తేదీ నుంచి గ్రామాల్లో నిర్వహించనున్న పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రాధాన్యం కలిగిన, పెండింగ్, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనుల వివరాలు, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, పల్లెప్రకృతి వనాల సుందరీకరణ, రోజూ ఇండ్ల నుంచి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుల్లో వర్మీకంపోస్టును తయారు చేయాలని కోరారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, ట్రీగార్డ్స్ ఏర్పాటు, మిషన్ భగీరథ నీటి సరఫరా, పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు చేయడం వంటి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో తాసిల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజయ్‌కుమార్, వైస్ ఎంపీపీ గందె శ్రీలతాశ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ స్వరాజ్యమే సీఎం లక్ష్యం
రాయపర్తి: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయల వ్యయంతో పల్లెల రూపురేఖలు మారుస్తున్నారని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి తెలిపారు. రాయపర్తిలోని రైతు వేదిక భవనంలో ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్ అధ్యక్షతన ఐదో విడుత పల్లెప్రగతిపై మండలస్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ హాజరై మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని గ్రామాలన్నీ అభివృద్ధిలో పట్టణాలతో పోటీ పడుతున్నాయని తెలిపారు. ఈ నెల 3 నుంచి 18 వరకు మండలంలోని 39 గ్రామాల్లో చేపట్టనున్న పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రెంటాల గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ అధికారుల్లో జవాబుదారితనం లోపించడం వల్ల మండలంలో సుమారు 15 గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా ఎలాంటి అవార్డులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు తమ పనితీరు మార్చుకోవాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ రంగు కుమార్, తాసిల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభద్రం, ఏపీఎం పులుసు అశోక్‌కుమార్, పశు వైద్యాధికారులు వీరగోని శ్రుతి, సోమశేఖర్, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, పీఆర్ ఏఈ శేషం కిరణ్‌కుమార్, ఎంఈవో నోముల రంగయ్య, గిర్దావర్ చంద్రమోహన్, సీసీలు దేవేంద్ర, పావని, రాజేశ్‌కుమార్, సాయిప్రసాద్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
‘పల్లెప్రగతి’ని విజయవంతం చేయాలి
నర్సంపేటరూరల్/దుగ్గొండి/సంగెం: ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ మోతె కళావతి పిలుపునిచ్చారు. నర్సంపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో 5వ విడుత కార్యాచరణ అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మోతె కళావతి, ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని కోరారు. సీనియర్ అసిస్టెంట్ సంతోష్‌బాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. దుగ్గొండి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య అధ్యక్షతన పల్లెప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని ఎంపీపీ కోరారు. సమావేశంలో దుగ్గొండి ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సంగెం మండల పరిషత్ కార్యాలయంలో 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చేపట్టనున్న పల్లెప్రగతి కార్యక్రమంపై ఎంపీపీ కళావతి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 33 మంది సర్పంచ్‌లకు కుంటపల్లి, గాంధీనగర్, నల్లబెల్లి, వీఆర్ఎన్తండా, గుంటూరుపల్లి సర్పంచ్‌లు మాత్రమే హాజరయ్యారు. 14 మంది ఎంపీటీసీలకు ఎంపీపీతోపాటు సంగెం ఎంపీటీసీ మల్లయ్య మాత్రమే హాజరయ్యారు. ఎంపీపీ కళావతి మాట్లాడుతూ పల్లెప్రగతిని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో ఎన్ మల్లేశం, ఎంపీవో కొమురయ్య, అధికారులు పాల్గొన్నారు.