కాజీపేట ఫాతిమానగర్‌లోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో మంగళవారం నిర్వహించనున్న కార్మిక ధర్మ యుద్ధ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మికుల సెగ ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి తగలాలని పేర్కొన్నారు. స్కూల్ గ్రౌండ్లో ఆదివారం ఆయన కార్మిక చైతన్య మాసోత్సవ ముగింపు సద స్సు బెలూన్ను ఎగురవేసి మాట్లాడారు. కార్మిక ధర్మ యుద్ధానికి కేంద్ర ప్రభుత్వం భయపడి కాజీపేట రైల్వే స్టేడియంలో సదస్సుకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం కార్మిక హక్కులను కాలరాస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, దేశం లో ఎక్కడాలేని విధంగా కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. ముగిం పు సభకు కార్మిక నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.
కాజీపేట, మే 29 : ఢిల్లీకి సెగ తాకేలా పోరుగుల్లు వరంగల్‌లో ఈ నెల 31న సంఘటిత, అసంఘటిత కార్మికులతో నిర్వహించే కార్మిక ధర్మ యుద్ధ సభకు కార్మికలోకం అధిక సంఖ్యలో తరలిరావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కా జీపేటలోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో ఆదివారం కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి కార్మిక చైతన్య మాసోత్సవ ముగింపు సదస్సు బెలూన్ను ఎగురవేశారు. అనంతరం దాస్యం మాట్లాడుతూ.. కేంద్రం కార్మిక ధర్మ యుద్ధానికి భయపడిందన్నారు. అందుకే కాజీపేట రైల్వే స్టేడియంలో సదస్సు జరుగకుండా ఉండేందుకు అధికారులపై ఒత్తి డి తెచ్చిందన్నారు. కేంద్రం అనుమతి ఇవ్వనంత మాత్రాన కార్మికుల కోసం చేస్తున్న యు ద్ధం ఆగదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల లు ఏర్పాటు చేసి నిరుపేద కార్మికుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తున్నామరు. కేంద్రం కా ర్మిక హక్కులను కాలరాస్తున్నదన్నారు. ప్రధా ని మోదీ ఇటీవల రైతులకు క్షమాపణ చెప్పారని, అదేవిధంగా ఉద్యోగులు, కార్మికులు, దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
పబ్లిక్ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తుండడం తో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని అ న్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలకు కారణమైతే సీఎం కేసీఆర్ మానవతా దృ క్పథంతో ఆ కుటుంబాలకు రూ. 3లక్షలు అం దించారని చెప్పారు. దళితులను ధనవంతులు గా చేసేందుకు దళిత బంధు పథకాన్ని అమ లు చేస్తున్నారన్నారు. సెయింట్ గ్యాబ్రియల్ మైదానంలో 31న నిర్వహించే ముగింపు సభ కు కార్మిక నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవత్ రాథోడ్ హాజరుకానున్నట్లు తెలిపా రు. కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్, జి ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కా ర్మిక మాసోత్సవ కోఆర్డినేటర్ పుల్లా శ్రీనివాస్, సంపత్‌రెడ్డి, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్య వస్థాపకుడు పాశం శ్రీనివాస్, కార్పొరేటర్ ఎ లకంటి రాములు, కార్మిక నాయకుడు మల్లే శం, రైతుబంధు సమితి సభ్యుడు సుంచు కృ ష్ణ, దర్గా సొసైటీ చైర్మన్ వనంరెడ్డి, వర్ధమాన్ శ్రీనివాస్, నాయకులు నార్లగిరి రమేశ్, హరినాథ్, ప్రేమ్‌నాథ్,సాంబయ్య పాల్గొన్నారు.