యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వడ్ల కొనుగోళ్లపై కేంద్రం మాట తప్పినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం నేనున్నానంటూ రైతన్నకు అండగా నిలిచింది. దళారుల చేతిలో మోసపోకుండా ఊళ్లోనే కాంటాలు పెట్టి కనీస మద్దతు ధరకు కొంటుండడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సీజన్లో జిల్లాలో 58,500 మెట్రిక్ టన్నుల వడ్ల సేకరణ లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు 12,425 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నది. ఈ మేరకు 129 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించిన అధికారులు ఇప్పటికే 94 కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభించారు. అలాగే ప్యాడీక్లీనర్లు, తేమ కొలిచే పరికరాలతోపాటు అకాల వర్షాలతో ధాన్యం తడువకుండా సరిపడా టార్పాలిన్లు తెప్పించింది. అలాగే త్వరగా కాంటాలు పూర్తి చేసి రవాణా చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నా రు. ధాన్యం మిల్లులకు చేర్చేందుకు వాహనాలను సైతం అందుబాటులో ఉంచారు.
ములుగు, మే27(నమస్తేతెలంగాణ): వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. జిల్లాలో 129 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు ఇప్పటి వరకు జిల్లాలో 94 సెంటర్లలో వడ్డు కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 30వేల ఎకరాల్లో 58,500 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అధికారులు అంచ నా వేశారు. కాగా, ఇప్పటి వరకు రైతుల వద్ద నుంచి 12,425 మెట్రిక్ టన్నుల వడ్ల సేకరణను చేపట్టి జిల్లాలో 25 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఏ గ్రేడ్ ధా న్యానికి రూ.1980, సాధారణ రకానికి రూ.1940 చొప్పున క్వింటాల్‌కు ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించగా ఆ ప్రకారంగా కొనుగోలు చేసిన వడ్ల పైసలను సంబంధిత రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు.
మరో 15 రోజుల్లో పూర్తి కానున్న వడ్ల కొనుగోలు
రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే భిన్నంగా ములుగు జిల్లాలో వడ్ల పంట ఆలస్యంగా చేతికి వస్తుండడంతో ఇప్పటి వరకు 25శాతం మాత్రమే వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. మరో 15 రోజుల్లో వడ్ల కొను గోలు ప్రక్రియ 100 శాతం పూర్తి కానుంది. ఇందుకోసం ఐకేపీ ద్వారా 25, పీఏసీఎస్ ద్వారా 89, ఐటీడీ ఏల ద్వారా జీసీసీ కొనుగోలు కేంద్రాలను పంట చేతికి వచ్చిన ప్రాంతాలలో దశల వారిగా ప్రారంభించ నున్నారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి ప్రారంభమైన వడ్ల కొనుగోలు ప్రక్రియ జూన్ 15వ తేదీ వరకు పూర్తి కానుంది.
560 బస్తాలు విక్రయించా..
నాకు ఐదెఎకరాల భూమి ఉంది. దీంతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని రామప్ప శివా రులో ఆర్ఎన్ఆర్ వరి పంటను సాగు చేసిన. పంట మంచిగ చేతికి వచ్చింది. మొత్తం 560 బస్తాల దిగు బడి వచ్చింది. క్వింటాకు ప్రభుత్వం రూ.1960 చొప్పున కొనుగోలు కేంద్రం వద్ద మద్దతు ధర అంది స్తుండడం సంతోషంగ ఉంది. నాకు రైతుబంధుసాయం కూడా అందుతోంది. కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయం లో సహకరించకుండా రైతులను మోసం చేసింది. సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఎంతో ఊరట లభించింది.
– సూరం శ్రీనివాస్, రైతు, బండారుపల్లి
కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశాం
కలెక్టర్ ఆదేశాలతో పంట చేతికి వచ్చిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభి స్తున్నాం. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తూ ఈ ప్రక్రియను వేగవంతం చేశాం. ప్రభుత్వ సూచనల మేరకు మద్దతు ధర కల్పిస్తూ రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు నగదు జమ చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాం. మరో 15 రోజుల్లో కొనుగోలు ప్రక్రియను 100 శాతం పూర్తి చేసి రైతుల ఖాతాల్లో వడ్ల పైసలు జమయ్యేలా చూస్తాం.
-పీ రాములు, పౌరసరఫరాల శాఖ మేనేజర్, ములుగు జిలా