లింగాలఘనపురం,మే 27: పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో భాగంగా మండలంలోని 22 మంది లబ్ధిదారులకు రూ.లక్షా 116 చొప్పున మంజూరైన చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీపీ చిట్ల జయశ్రీ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని ఆడబిడ్డల వివాహానికి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆదుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో పేదలకు చేయూతనిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలదిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ కిట్‌లో భాగంగా పాప జన్మిస్తే రూ.13 వేలు, బాబు అయితే రూ.12 వేలు అందిస్తున్నారని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల సంక్షేమానికి సేవలందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా నిలువాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేని బీజేపీ, కాం గ్రెస్ పార్టీలు ప్రజాదరణ కోల్పోయాయ ని, వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలుపుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కొండబోయిక కిరణ్‌కుమార్, కొమురవెళ్లి దేవస్థాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, ‘దిశ’ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, తహసీల్దార్ అంజయ్య, ఇన్చార్జి ఎంపీడీవో సీతారాం నాయుడు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్, నాయకులు దూసరి గణపతి, బో యిని రాజు, కేమిడి కవితావెంకటేశ్, ఎడ్ల రాజు, కేమిడి యాదగిరి, లింగాల వెంకటేశ్, గట్లగళ్ల శ్రీహరి, కొత్తకొం డ గంగాధర్, వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు.