హనుమకొండ చౌరస్తా, మే 27 : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆటకు ఫ్యాన్స్ కూడా అంతే ఉంటారు. అయితే పురుషులు ఎక్కువగా ఆడే క్రికెట్‌పై బాలికలూ ఆసక్తి చూపుతున్నారు. నేర్చుకోవాలనే పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మైదానంలో అడుగుపెడుతున్నారు. బ్యాట్ చేత పట్టుకొని గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ దూసుకుపోతున్నారు. చూసేందుకు చిన్న పిల్లలే కానీ బ్యాట్, బాల్‌తో నెట్‌ప్రాక్టీస్ చేస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా హనుమకొండ జేఎన్ఎస్ మైదానం లిటిల్స్ క్రికెట్ ప్రాక్టీసింగ్తో సందడిగా కనిపిస్తోంది.
క్రేజీ గేమ్..
అంతర్జాతీయ క్రీడల్లో ఒకటి క్రికెట్. బ్యాట్, బంతితో మైదానంలో పరుగులు పెడుతున్నారు. కాలానికి తగ్గట్టుగా మారడం కూడా క్రికెట్‌కు అతిపెద్ద అడ్వాంటేజ్ అయింది. టెస్ట్క్రికెట్పై జనానికి బోరు కొట్టగానే వన్డేలు వచ్చేశాయి.. వన్డేలు కూడా ఇంతేనా అనుకునే టైంలో టీ-20 క్రికెట్ వచ్చింది. ఇక టీ-20 క్రికెట్ మజాను మరింత పెంచుతూ ఐపీఎల్ రంగప్రవేశం చేసింది. ఇలా ఎప్పటికప్పుడు క్రికెట్లో వచ్చిన కొత్తదనం.. పటిష్టమైన ఫ్యాన్‌బేస్‌ను ఏర్పాటుచేసింది. ఎంత సూపర్‌స్టార్ సినిమా అయినా.. దేశంలో వందకోట్ల మంది చూస్తారని గట్టిగా చెప్పలేం కానీ క్రికెట్ మ్యాచ్ మాత్రం వంద కోట్ల మంది చూడడం గ్యారెంటీ అనేంతగా క్రికెట్ ఎదిగింది.
క్రికెట్ అంటే చాలా ఇష్టం

మేమిద్దరం అక్కాచెల్లెళ్లం. మాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంట్లో క్రికెట్ ఆడుకునేది. సమ్మర్ హాలీడేస్‌లో క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చాం. మా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కోచ్ మెళకువలు చెబుతున్నారు. ఆరు నెలల నుంచి శిక్షణ తీసుకుంటున్నాం.. చాలా మంది క్రికెట్ నేర్చుకునేందుకు వస్తున్నారు.
– డి.ప్రజ్ఞ, శ్రీసహస్ర
ప్రాక్టీస్.. ప్రాక్టీస్..
మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరం.. ఇప్పుడు ఎన్ని క్రీడలు ఉన్నా క్రికెట్‌కు ఆదరణ తగ్గదు. క్రికెట్ ఆడేందుకు చాలామంది ఇష్టపడుతారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు బ్యాట్ పడుతున్నారు. ఇక్కడ ఓనమాలు దిద్దిన తర్వాత క్రీడాకారుడి ప్రతిభనుబట్టి వివిధస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తారు. చిన్నారులు వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా క్రికెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు.
వేసవి క్రీడా శిక్షణశిబిరంలో సందడి..

వేసవి క్రీడా శిబిరాలు అనగానే పిల్లలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. జేఎన్ఎస్ మైదానం వేసవి క్రీడాశిక్షణ శిబిరాలతో సందడిగా మారింది. అన్ని రకాలతో బిజిబిజీగా ఉన్నా క్రికెట్ నెట్‌ప్రాక్టీస్‌లో మాత్రం అమ్మాయిలతో సందడి నెలకొంది. ఆటల రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్న క్రీడాకారుల కలలకు ఇక్కడి నుంచే బీజం పడుతోంది. చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకుంటున్న అమ్మాయిలు మైదానంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూస్టేడియంతో పాటు అన్నిచోట్ల క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. పిల్లలకు వారికి ఇష్టమైన క్రీడల్లో శిక్షణ ఇస్తుండగా క్రికెట్లో గతంలో ఎన్నడూలేనివిధంగా ఈసారి అమ్మాయిలు సైతం అధిక సంఖ్యలో క్రికెట్ నేర్చుకునేందుకు వస్తుండడం విశేషం. జేఎన్ఎస్లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు క్రికెట్ నెట్‌ప్రాక్టీస్ చేస్తున్నారు.
20 రోజుల నుంచి నేర్చుకుంటున్నా..
20 రోజుల నుంచి క్రికెట్ నేర్చుకోవడానికి వస్తున్నా. చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. రన్నింగ్ బాగా చేస్తా. బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ చేస్తా. ఉదయం, సాయంత్రం క్రికెట్ నేర్చుకుంటున్నా. సార్ బాగా శిక్షణ ఇస్తున్నారు.
– శ్రీతిక, భీమారం
మిథాలీరాజ్ స్ఫూర్తితో..

మాది మంచిర్యాల జిల్లా చెన్నూరు. హనుమకొండలోని కాకతీ య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాను. ఈస్ట్‌గోదావరిలో జరిగిన అండర్-17 నేషనల్లో పాల్గొన్నా. ప్రోత్సాహం ఉంటే అ మ్మాయిలు కూడా క్రికెట్లో రాణిస్తారు. క్రికెట్ అంటే అబ్బాయిలకు మాత్రమే కా దు అమ్మాయిలు కూడా ఆడతారని బాగా ఆడి నిరూపిస్తా. క్రికెటర్లు కోహ్లీ, మిథాలీరాజ్ స్ఫూర్తితో క్రికెట్లో రాణిస్తా.
– సుచరిత, చెన్నూరు
వచ్చేవాళ్లలో సగం అమ్మాయిలే..
క్రికెట్ అంటే అందరికీ ఇష్టమే. చూడడంతో పాటు ఆడేవాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. క్రికెట్ అంటే కేవలం అబ్బాయిలు మాత్రమే ఆడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలూ ఆడుతున్నారు. చిన్ననాటి నుంచే క్రికెట్ నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా వారికి బాగుంటోంది. సమ్మర్ క్యాంప్‌లో సుమారు 50మంది వరకు క్రికెట్ నేర్చుకునేందుకు వస్తున్నారు. అందులో సగం వరకు అమ్మాయిలు ఉన్నారు.
– మహ్మద్ అఫ్జల్, క్రికెట్ కోచ్