పర్వతగిరి, మే 26: పల్లె ప్రగతి పనుల్లో అలస త్వం వహించవద్దని ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్ కా ర్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో జీపీ ల్లోని డంపింగ్ యార్డులో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేయాలని సూ చించారు. పొడి చెత్తను ప్లాస్టిక్ వ్యర్థాలను ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్‌కి పంపించాలని, వీటిని అమ్మడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చాలని చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టించాలన్నారు. అన్ని వైకుంఠధామాల్లో నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం, మరుగుదొడ్లు సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే హరితహారం సీజన్‌కు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పల్లె ప్రగతి పనులలో అలసత్వం వహించరాదని, ఉపాధి హామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చూడాలని కోరారు. ఎంపీవో పాక శ్రీనివాస్, ఏపీవో సుశీల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.