నర్సంపేట రూరల్, మే 14: నర్సంపేట, పరకాల ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి శనివారం మండలంలో జరిగిన పలు వివాహాలకు హాజరయ్యారు. ఇందులో భాంజీపేటకు చెందిన కొయ్యల యాకూబ్-భాగ్య దంపతుల కూతురు సరయు వివాహం ప్రవీణ్‌తో జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్యేలు పెద్ది, చల్లా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే, ఇప్పల్‌తండా, నర్సింగాపురంలో జరిగిన పెళ్లిళ్లకు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతేకాకుండా పర్శనాయక్‌తండా సర్పంచ్ బానోత్ గాంధీనాయక్-కమల దంపతుల కుమారుడు నందకిశోర్ వివాహం మేఘనతో జరిగింది. సుదర్శన్‌రెడ్డి, ధర్మారెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నర్సంపేట మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, సర్పంచ్‌లు గాంధీ, రవీందర్, బానోత్ సుజాత-శంకర్, నాయకులు గంధం జగన్మోహన్రావు, ఉప్పుల భిక్షపతి, ఐరెడ్డి రాజిరెడ్డి, సౌరపు నర్సయ్య, పిండి కొమురయ్య, కుమారస్వామి, రవి, రాజు, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి చల్లా పరామర్శ
సంగెం: తిమ్మాపురంలో ఇటీవల బండి చైతన్య మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా చైతన్య చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, మాజీ సర్పంచ్ రాంరెడ్డి, తెలంగాణ జాగృతి నాయకుడు అఖిల్‌యాదవ్ ఉన్నారు.