నర్సంపేట, మే 1 : యువత స్వశక్తితో ఎదగాల ని, పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. ఆదివారం నర్సంపేటలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ఉద్యోగార్థుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్స్, టెట్ పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ కోసం డివిజన్ వ్యాప్తంగా 12 వందల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి ఉచిత కోచింగ్ తరగతులు ఉదయం 9 నుంచి సా యంత్రం 5గంటల వరకు వరుసగా 60 రోజుల పా టు నిర్వహిస్తామన్నారు.
ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు గతంలోనూ ఉచిత కోచింగ్ ఇచ్చామన్నారు. 16 వందల మంది రెండు నెలల పాటు శిక్షణ తీసుకోగా, 270మంది కానిస్టేబుల్, బ్యాంకిం గ్ ఇతర ఉద్యోగాలు సాధించారన్నారు. నర్సంపేటకు ఇటీవలే బీసీ స్టడీ సర్కిల్ కూడా మంజూరు చేయించామని పేర్కొన్నారు. మూడుసార్లు జాబ్‌మేళా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. నర్సంపేటను ఎడ్యుకేషన్ హాబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, సీఐ పులి రమేశ్, విన్నర్స్ అకాడమీ డైరెక్టర్ రాజిరెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బత్తిని చంద్రమౌళి, కౌన్సిలర్ దార్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. 
నెక్కొండ : కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా రైతన్న శ్రేయస్సు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని రెడ్లవాడ, సూరిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపిస్తోందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, నెక్కొండ, రెడ్లవాడ, సూరిపల్లి సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, ఘంటా దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, జడ్పీటీసీ లావుడ్యా సరోజనాహరికిషన్, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, మాజీ ఎంపీపీ ఆవుల చంద్రయ్య, రెడ్లవాడ సొసైటీ ఉపాధ్యక్షుడు సంపత్, సర్పంచ్ రావుల శ్రీలతాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.