వర్ధన్నపేట/పర్వతగిరి, మే 1: రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలోని ఎంఎంఆర్ ఫంక్షన్హాల్లో ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అరూరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో పేదలకు కానుకలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ముస్లింలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ మైనార్టీ గురుకులాలు స్థాపించారని తెలిపారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తాగు, సాగునీరు, విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, తాసిల్దార్ నాగరాజు, ఏసీపీ గొల్ల రమేశ్, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, తూళ్ల కుమారస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, మైనార్టీ నాయకులు ఎండీ అన్వర్, రహీమొద్దిన్ పాల్గొన్నారు. అలాగే, పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్‌లాల్, ఎంపీపీ కమల పంతులు, తాసిల్దార్ మహబూబ్అలీ, మనోజ్‌కుమార్‌గౌడ్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, చిన్నపాక శ్రీనివాస్, నాయకులు షబ్బీర్ అలీ, బాబు, బుర్ర యాకయ్య పాల్గొన్నారు.