కాశీబుగ్గ, ఏప్రిల్19: పేద ప్రజల శ్రేయస్సే సీఎం కేసీఆర్ ధ్యేయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అ న్నారు. మంగళవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పతి ్తయార్డు సమీపంలో రూ. 5 భోజనం క్యాంటీన్, ఆపరాల యార్డులో చిల్లీస్ టెస్టింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ సౌజన్యంతో అన్న పూర్ణ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీన్ని సద్వినియోగించు కోవాలన్నారు. ప్రతి పేదవాడు పస్తులు లేకుండా కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రైతు లు, వ్యాపారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చిల్లీస్ టెస్టింగ్ యూనిట్లో రెండు యంత్రాలను అందుబాటులో ఉంచామన్నారు. వీటితో మిర్చి నాణ్యత, పింజ పొడవు, తేమ, రంగు శాతం తెలు స్తుందని తెలిపారు. రైతులు, వ్యాపారులు ఈ యంత్రాలను సద్వినియోగించుకోవాలని కోరా రు. కార్యక్రమంలో చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, జేడీఎం ఎన్నారపు మల్లేశం, డీడీఎం అజ్మీరా రా జూనాయక్, డీఎంవో పాలకుర్తి ప్రసాదరావు, కా ర్యదర్శి బరుపాటి వెంకటేశ్రాహుల్, చాంబర్ అధ్యక్ష కార్యదర్శులు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, మాడూరి వేదప్రకాశ్, వ్యాపారులు, కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు కేతిరి రాజశేఖర్, గండ్రాతి భాస్కర్, గంధం గోవిందు, పత్రి సుభాష్, ముడు సు నరసింహులు పాల్గొన్నారు.