రాయపర్తి, ఏప్రిల్ 19: టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటన, బహిరంగ సభను టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు జయప్రదం చేయాలని రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు గబ్బెట బాబు అధ్యక్షతన మంగళవారం మండల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతారని తెలిపారు.
పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. అనంతరం మొదటిసారి రాయపర్తికి వచ్చిన మెట్టు శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, నాయకులు పూస మధు, నయీం, గారె నర్సయ్య, అయిత రాంచందర్, బిల్ల సుభాష్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, యాదవరెడ్డి, సాగర్‌రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి బహిరంగ సభకు భారీగా తరలిరావాలి
వర్ధన్నపేట/కరీమాబాద్/ఖిలావరంగల్/గీసుగొండ: హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నేడు జరిగే మంత్రి కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ కోరారు. వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణంతోపాటు అన్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ డివిజన్ పరిధిలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. కేటీఆర్ బహిరంగ సభకు డివిజన్ నుంచి భారీగా ప్రజలు తరలిరావాలని కోరారు. ఆమె వెంట ఈదుల రమేశ్, బజ్జూరి రవి, కలకోట్ల రమేశ్, ఈదుల భిక్షపతి, బొల్లం సంజీవ్ ఉన్నారు. అలాగే, 32వ డివిజన్లో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్చార్జి నాగపురి సంజయ్‌బాబు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సభకు తరలిరావాలని కోరారు. ఆయన వెంట పొగాకు సందీప్, మోడెం ప్రవీణ్, బొల్లం రాజు, వంగరి కోటి, తరాల రాజమణి, కొండ రాజు, దస్తగిరి, ఎరుకల కళావతి, పూదరి పద్మ ఉన్నారు.
39వ డివిజన్లో జరిగిన సమావేశంలో కార్పొరేటర్ సిద్దం రాజు మాట్లాడుతూ కేటీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి సమావేశం నిర్వహించి టీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ సభకు తరలిరావాలని కోరుతూ ఖిలావరంగల్ తూర్పుకోటలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నాయకులు బిల్లా శ్రీకాంత్, బోగి సురేశ్, సంగరబోయిన చందర్, సంగరబోయిన ఉమేశ్, ఎండీ ఉల్ఫత్, సిరబోయిన వాసుదేవ్, కరుణాకర్ పాల్గొన్నారు.
నేడు హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించనున్న కేటీఆర్ బహిరంగ సభకు గీసుగొండ మండలంతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని టీఆర్ఎస్ నాయకుడు సుంకరి శివకుమార్ కోరారు.