నర్సంపేట,ఏప్రిల్19: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపా డుకుంటానని నర్సంపేట ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నర్సంపేటలో చెన్నారావుపేట మండలం కోనా పురం గ్రామ సర్పంచ్ వెల్ధే సుజాతాసారంగం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఆమె వెంట 120 మం ది కార్యకర్తలు, వార్డు సభ్యులు, యూత్ సభ్యులు పార్టీలో చేర గా, ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కోనాపురం సర్పంచ్ టీఆర్ఎస్లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, అన్ని పార్టీల్లో ఉన్న ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్నారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కోనాపురం గ్రామంలో తనకు మె జారిటీ ఓట్లు రాకున్నా అభివృద్ధి పథకంలో నడిపించుకుంటూ వెళ్తున్నట్లు తెలిపారు. అం దులో భాగంగా కోనాపురం నుంచి లింగాపురానికి, లింగాపురం నుంచి గురిజాలకు, గురిజాల నుంచి మహేశ్వరం క్రాస్ రోడ్డు వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయించానని అ న్నారు. గ్రామంలో వైద్యఅవసరాలు తీర్చడా నికి హెల్త్ సబ్ సెంటర్‌ను మంజూరు చే యించానని, త్వరలో దానిని ప్రారంభిస్తామని తెలిపారు. చెన్నారావుపేట మండలానికి గో దావరి నీటిని తీసుకువచ్చి రైతుల పాదాలు కడుగడానికి ఆనాటి నుంచి నేటి వరకు ప్రయత్నాలు చేస్తే నేడు రూ. 10కోట్లతో గీసుకొండ మెయిన్ కెనాల్ వద్ద అడ్డంగా షట్టర్ నిర్మాణం చేయించి చెన్నారావుపేట రైతులకు గోదావరి నీటిని తీసుకొచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్య క్షుడు బాల్నె వెంకన్న గౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు రఫీ, జడ్పీటీసీ పత్తినాయక్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ ఎంపీటీసీ జక్క అశోక్‌యాదవ్, వైస్ చైర్మన్ కంది కృష్ణారెడ్డి, మండల యూత్ నాయకులు కంది కృష్ణచైతన్య పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ సభను విజయవంతం చేయండి 
నెక్కొండ: నర్సంపేటలో బుధవారం మంత్రి కేటీఆర్ సభకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. నెక్కొండలో మంగళవారం టీఆర్ఎస్ అధ్యక్షుడు సంగని సూరయ్య, ఎంపీ పీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాము ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మె ల్యే హాజరై మాట్లాడారు. మండలం నుంచి మూడువేల మంది తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. సమావేశంలో జడ్పీటీసీ లావుడ్యా సరోజనాహరికిషన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, పట్టణ అధ్యక్షుడు కొణిజేటి భిక్షపతి, రెడ్లవాడ, సూరిపల్లి సొసైటీ ఛైర్మన్లు జలగం సంపత్‌రావు, ఘంటా దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల నా యకులు గుంటుక సోమయ్య, చల్లా చెన్నకేశవరెడ్డి, సూరం రాజిరెడ్డి, కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, దొనికెన సారంగం, ఇటుకాల యాకయ్య, పొడిశెట్టి సత్యం తదితరులు పాల్గొన్నారు .