కాశీబుగ్గ, ఏప్రిల్19: నగరం లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశో ధనా కేంద్రంలో మంగళవారం ‘మామిడి సాగు- కోత అనంతరం మార్కెటింగ్, ఎగుమతులు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి మాట్లాడుతూ మామిడి సాగుకు మన రాష్ట్రంలోని వాతావరణం చాలా అనుకూలమని అ న్నారు. మంచి నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయ ని తెలిపారు. మన రాష్ట్రంలో పండించే మామిడి పండ్లు ఇతర రాష్ర్టాలతోపాటు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉందని అన్నారు. జిల్లా ఉద్యాన శాఖాధి కారి శ్రీనివాసరావు మాట్లాడుతూ మామి డిలో అధిక ఉష్ణోగ్రత, బూడిద తెగుళ్లు, తేనె మంచు పురుగు, నీటి ఎద్దడి, అధిక తేమ, హార్మోన్ల లోపం వల్ల పిందె, కాయ రాలిపోతాయని తెలిపారు.
పిందె రాలటం తగ్గించడానికి 20 పీపీఎం నాఫ్తలిన్ ఎసిటిక్ ఆసిడ్ (లీటర్ నీటికి 20గ్రాములు) లేదా 10పీపీఎం 2,4డి లీటర్‌కు 10 మిల్లీగ్రాములు కలిపి పిచికారీ చేయాల న్నారు. ప్రొఫెసర్ వెంకట్ రామ్‌రెడ్డి మాట్లా డుతూ మామిడికాయలు మాగ బెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడకం అనర్థదాయకమని అన్నారు. పరిపక్వతకు రాని కాయలను ముందుగా కోయడం వల్ల కాయ నాణ్యత సరిగా లేకుండా రుచిగా ఉండద ని అన్నారు. అయినప్పటికీ కాయ బంగారు పసుపు రంగు సంతరించు కొని చూపరులను బాగా ఆకట్టు కుంటుందని తెలి పారు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బీ అనిల్‌కుమార్, ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్ హరికాంత్, డాక్టర్ మాధవి, డాక్టర్ మౌనిక, మామిడి ఎగుమతి కంపెనీ మేనేజర్ శ్రీనివాస్, ఎఫ్ ఎంసీ కంపెనీ మేనేజర్ మణిచందర్, నాలుగు జిల్లాల అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.