దుగ్గొండి, ఏప్రిల్ 17 : మండలంలోని నాచినపల్లి ప్రభు త్వ పాఠశాలలో విద్యనభ్యసించిన 1996-97 పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా కలిసి తా ము చదువుకున్న పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమ్మెళనంలో పూర్వ విద్యార్థులంతా సమావేశమయ్యారు. 25 ఏండ్ల క్రిందటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం గురువులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గ్రామ సర్పంచ్ పీ మమతారాజు, ఉపసర్పంచ జంగ రాజిరెడ్డి, ఎంపీటీసీ ఎన్ మమతామోహన్, ఎస్ఎంసీ చైర్మన్ బొమ్మినేని తిరుపతిరెడ్డి, సభ్యుడు నరహరి వీరారెడ్డి, ఉపాధ్యాయులు తిరుపతిరెడ్డి, దేవకర్ణ, సదానందం, కృపాకర్, రమేశ్, సారంగపాణి, శ్రీదేవి, పూ ర్వపు విద్యార్థులు బుగ్గ యుగేంధర్, సతీశ్, బీ రాజ్‌కుమార్, రాజిరెడ్డి, రవీందర్, సుదర్శన్, రాజేందర్, విజయ్‌కుమార్, రాజేశ్వర్‌రావు, పద్మ, అనిత, పద్మ, రమ పాల్గొన్నారు.
లక్నెపల్లిలో..
నర్సంపేట రూరల్: మండలంలోని లక్నెపల్లిలో ఆదివారం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక లక్నెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-94 విద్యాసంవత్సరంలో 7వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులంతా ఒక చోటకు చేరుకున్నారు. గత పాఠశాలలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉల్లేరావు రాజయ్య, పరాచికపు కృష్ణ, బారపాక శ్రీనివాస్, ఇట్టబోయిన రాజు, జినుకల శైలజ, కల్పన, పరాచికపు వేణుగోపాల్, వనిత, ప్రమీళ తదితరులున్నారు.
మొగిలిచర్ల పాఠశాలలో.. 
గీసుగొండ: గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో 1974 సవంత్సరంలో పదో తరగతి చదవుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల కోసం శాశ్వత నిధికి కిషన్ రూ.లక్ష, జైపాల్‌రెడ్డి రూ.లక్ష యాభైవేలు పాఠశాల పేరు మీదుగా జమ చేశారు. విద్యార్థుల ఆవసారాల కోసం ఈ నిధులను వినియోగించుకోవాలని వారు సూచించారు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.