కాశీబుగ్గ, ఏప్రిల్ 4 : టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. సోమవారం 14వ డివిజన్లోని బాలాజీనగర్‌లోని అప్సర ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్‌కట్ చేసి, కార్యకర్తలను స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ నాయకులు పత్రి సుభాష్, గంధం గోవింద్, పత్రి రాజపోషా లు, తూర్పాటీ సంపత్, పస్తం యాదగిరిల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీయం కేసీఆర్ హయాంలోనే అన్ని వర్గాల వారు అబివృద్ధి చెందుతున్నారన్నారు. నిరుద్యోగులకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే స్పొకెన్ ఇంగ్లిష్ ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. తన పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదలకు అన్నదానం చేయడం అబినందనీయమన్నారు. ముడుసు నరసింహా, కేతిరి రాజశేఖర్, పత్రి యాకస్వామి, మచ్చర్ల స్టాలిన్ పాల్గొన్నారు.
ఎస్ఆర్నగర్లో..
నగరంలోని ఎనుమాముల శివారు ఎస్ఆర్నగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పసులాది మల్లయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నరేందర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముడుసు నరసింహా, కేతిరి రాజశేఖర్, మచ్చర్ల స్టాలిన్, రా పర్తి సతీశ్, ప్రభాకర్, నెరెల్ల సరోజన, కేతిరి సమ్మక్క, పసునూరి సరిత, కన్నం వనమాల, గడ్డం రాజేశ్వరి, శారద పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అరూరి రమేశ్ పుట్టినరోజు వేడుకలు
వరంగల్ చౌరస్తా: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ జన్మదినం సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీపన్న యువసేన ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి, గొడిశాల కార్త్తీక్, కుంభం శివ, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట: ఎమ్మెల్యే అరూరి రమేశ్ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే రమేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం హన్మకొండలోని ఆయన స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్ఛం అం దించి శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం వర్ధన్నపేటలో జరిగిన నిరసన దీక్షకు హాజరైన అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావడంతో పార్టీ శ్రేణులు క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.