నర్సంపేట, మార్చి 16: గ్రామీణ మహిళల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలో సెర్ప్ ఉద్యోగులు ఎమ్మెల్యే సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం, ఆర్థిక స్వావలంబన కోసం 20 ఏళ్లుగా సెర్ప్ సిబ్బంది కృషి చేస్తున్నారని అన్నారు. వారి సేవలను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగుల్లా పేస్కేల్ వర్తింప చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షనీయం అన్నారు. ఏపీఎం మహేందర్, ఈశ్వర్, శ్రీను, సుధాకర్, సునీత, సీపీలు ఏకాంబ్రం, మహేందర్, మాణిక్యం, రవి, యాకుబ్, పద్మ, నూరిన్నీసా, శోభ, వనమ్మ పాల్గొన్నారు. కాగా, తమ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకురావడంపై బుధవారం నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని వీవోఏలు, ఆర్పీలు సన్మానించారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్య క్షుడు గోనె యువరాజు, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, కౌన్సిలర్ దార్ల రమాదేవి, ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, డివిజన్ బాధ్యు లు రాణి, కవిత, కృష్ణవేణి, సబిత పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై ఫీల్డ్ అసిస్టెంటు సంఘాల జిల్లా నాయకుడు రాజు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం నర్సంపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. తమ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకురాలు నల్లా భారతి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, ఫీల్డ్ అసిస్టెంట్లు రాజు, రమేష్, సుమన్, సుకన్య, సుధ పాల్గొన్నారు.
రాయపర్తి : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్-గ్రామ పంచాయతీ వాణిజ్య సముదాయ భవనాల ఆవరణల్లో సీఎం కేసీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సముచిత న్యాయం కలుగుతున్నదని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, గారె నర్సయ్య, పూస మధు, అయిత రాంచందర్, గబ్బెట బాబు, ఎండీ.నయీం, మహ్మద్ అక్బర్, కంది ప్రభాకర్, కుందూరు యాదగిరిరెడ్డి, ఈజీఎస్ ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, ఐకేపీ ఏపీఎం పులుసు అశోక్ కుమార్, సీసీలు దేవేంద్ర, చెవ్వ యాదగిరి, ఫరీదుల అనిత, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
గీసుగొండ : మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు కోనాయిమాకుల క్రాస్ రోడ్డు వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిశేకం చేశారు. జడ్పీటీసీ పోలీసు ధర్మారావు హాజరై మాట్లాడారు. పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజుకుమార్, కార్యదర్శి చల్లా వేణుగోపాల్‌రెడ్డి, కోనాయిమాకుల సర్పంచు రాధాబాయి, ఫీల్డ్ అసిస్టెంట్లు కేలోతు స్వామిచౌహాన్, కరుణాకర్, బస్కె ప్రభాకర్, నర్సింగరావు, నాగమణి, విజయలక్ష్మీ, అనిల్, రాజు, గోపాల్, ఎల్లాస్వామి, మమత పాల్గొన్నారు.
సంగెం : సంగెం సెర్ఫ్ ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని వారు అన్నారు. ఎంపీపీ కళావతి, సర్పంచ్ బాబు, ఎంపీటీసీ మల్లయ్య, నరహరి, ఐకేపీ ఏపీఎం కిషన్, గుండేటి కుమార స్వామి, సదిరం రాజయ్య, గుండేటి ఏలియా, స్వరూపారాణి, బొజ్జ సురేష్ పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లో తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించ డం హర్షనీయమని భారతీయ ఖేత్ మజ్దూర్ యూని యన్ జాతీయ నాయకుడు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సేవలను గుర్తించిన సీఎం తిరిగి విధుల్లో తీసుకుంటున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు.
వర్ధన్నపేట : మండలంలోని ఫీల్డ్అసిస్టెంట్లు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంపీపీ అన్నమ నేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి పాల్గొని మాట్లాడారు. ఫీల్డ్అసిస్టెంట్లు జనగామ యాకయ్య రావుల మధు, శంకర్, రమేశ్, భిక్షపతి, రాజేందర్, లావణ్య, రేణుక, సంధ్య, శ్రీలత పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
మధ్యాహ్న భోజన తయారీ కార్మికుల వేతనాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.3వేలకు పెంచడంపై హర్షిస్తూ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం వరంగల్ విభాగం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బుధవారం వరంగల్ విభాగం అధ్యక్షురాలు బైరబోయిన సరోజన యాదవ్ ఆధ్వర్యంలో 24వ డివిజన్ పరిధిలోని పాపయ్యపేట చమన్ ప్రాంతంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పోలెపాక లక్ష్మి, ధనలక్ష్మి, కుమార్, రజియా, కొండి లక్ష్మి, ఎల్లమ్మ, రజిని పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ఆర్ఎంపీల సమస్యలు పరిష్కారం
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం మండల ఆర్ఎంపీ, పీఎంపీలు ఎమ్మెల్యేను కలిసి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ఎంపీ, పీఎంపీలు గ్రామీణులకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. మండల సంఘం అధ్యక్షుడు చక్రపాణి, కిరణ్, స్వామినాథ్, నన్నెసాహెబ్, శ్రీనివాస్, మనోహర్, ప్రకాష్ పాల్గొన్నారు.