ఖానాపురం, మార్చి 16: పాకాలకు గోదావరి జలాలు తీసుకువచ్చి తన కలను సాకారం చేసుకు న్నానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అ న్నారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే టీఆర్ఎ స్ నాయకులతో కలిసి కీర్యతండా శివారులోని ద బ్బవాగు వద్ద పాకాల-రామప్ప ప్రాజెక్టుకు గోదా వరి జలాల ట్రయల్ రన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రెండేళ్లలో పాకాలకు గోదావరి జలాలను తీసుకువస్తానని రైతులకు హామీ ఇచ్చానని, సీఎం కేసీఆర్ దీవెనలతో సాధించానని అన్నారు. కొంద రు పసలేని రాజకీయ నాయకులు ప్రాజెక్టు నిర్మా ణాన్ని ఆపడానికి ఎన్నో కుట్రలు చేశారని అన్నా రు. గోదావరి నదిపై నిర్మించిన ఏడు ప్రాజెక్టులను ఆడ్డుకోవడానికి కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తు న్నదని, అందులో పాకాల కూడా ఉందన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణకు ప్రాజెక్టులను తీసుకురావా లనే సోయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించుకుంటున్న ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకుం టుంటే తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నా రని విమర్శించారు.
తెలంగాణకు కిషన్‌రెడ్డి చేసిం ది శూన్యమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభు త్వం తెలంగాణపై కుట్రలు మానుకుని రాష్ట్ర అభి వృద్ధికి సహకరించాలని కోరారు. లేని పక్షంలో ప్ర జలే బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తారని హె చ్చరించారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేముల పల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ ఉమారాణి, ఉపేందర్ రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెం కట్రెడ్డి, తుంగబంధం కన్వీనర్ వేజళ్ల కిషన్‌రావు, సర్పంచ్ హఠ్య, అయిలయ్య, నాయకులు సో మారపు రాజశేఖర్, నాగరాజు, సర్వర్, దాసరి ర మేశ్, కుమారస్వామి, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.