నర్సంపేట రూరల్, ఫిబ్రవరి 22 : గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. లక్నెపల్లి గ్రామంలో రూ.50 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ జన్మించిన లక్నెపల్లి గ్రామాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. లక్నెపల్లిని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. పీవీ మెమోరియల్ ట్రస్ట్‌కు స్థలాలు ఇచ్చిన వారికి నర్సంపేట పట్టణంలో నివాస స్థలాలు అందించి సన్మానిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ లక్నెపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, డీఈ ఇజ్జగిరి, ఏఈ శ్రీనివాస్, సర్పంచ్ గొడిశాల రాంబాబు, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, ఉప సర్పంచ్ పరాచికపు సంతోష్, మాజీ ఎంపీటీసీ పరాచికపు శ్యాంసుందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్పింహారాములు, గ్రామ అధ్యక్షుడు పాత్కాల కొమ్మాలు, ఇతర గ్రామాల సర్పంచ్‌లు కొడారి రవన్న, గొడిశాల మమత, తుత్తూరు కోమల, బొజ్జ యువరాజు, లావణ్య, ఎంపీటీసీ భూక్య వీరన్న, నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, సమ్మయ్య, భాస్కర్, కూనూరు కుమార్, వల్లాల కర్ణాకర్, రాజిరెడ్డి, పెండ్యాల సదానందం, అల్లి రవి పాల్గొన్నారు.
నర్సంపేట : నర్సంపేట పట్టణంలో మార్చిలోపు ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలో పోస్ట్ పెయిడ్ గ్యాస్ కనెక్షన్ కోసం రెండో విడుత పనులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైపులైన్ ద్వారా గ్యాస్‌ను ఇంటింటికీ అందిస్తారని పేర్కొన్నారు. కొత్తగా గ్యాస్ కనెక్షన్లు కావాల్సిన వారు 7080111150 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటి రజనీకిషన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, కౌన్సిలర్లు దార్ల రమాదేవి, నాగిశెట్టి పద్మప్రసాద్, రాయిడి దుశ్యంత్‌రెడ్డి, రాంబాబు, రాజు, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, సొసైటీ చైర్మన్ మూరాల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.