రాయపర్తి, నవంబర్ 20: రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. మండలంలోని కొండూరు, కొలన్‌పల్లి, కేశవాపురంలో కొలన్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, సొసైటీ చైర్మన్ జక్కుల వెంకట్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వాల ఆదరణ కరువై పడావు పడిన వ్యవసాయం నేడు సీఎం కేసీఆర్ పరిపాలనలో వర్ధిల్లుతున్నదన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ ఎంతో తోడ్పాటునందిస్తున్నారని కొనియాడారు.
నేడు రాష్ట్రంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెటింగ్ లభిస్తున్నదన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల లభ్యత, వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుండడంతో రాష్ట్రంలోని రైతులు రెట్టించిన ఉత్సాహంతో పంటల సాగుకు శ్రీకారం చుడుతున్నారని వివరించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సొసైటీ వైస్ చైర్మన్ జక్కుల వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు చిలుముల ఎల్లమ్మ యాకయ్య, ఎంపీటీసీలు చిర్ర ఉపేంద్ర, బానోత్ శ్వేత సుభాష్‌నాయక్, ఏఈవోలు వేమిరెడ్డి హిమబిందు, సీఈవో శ్రీపాది యాదగిరి, ఇల్లంద మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎండీ ఉస్మాన్, తోట సుదర్శన్, రాయపర్తి సొసైటీ చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు అన్నమనేని అనిల్‌రావు, వసంత దేవేందర్, తోట నందు, గజ్జి శ్రీనివాస్, మాలోత్ దేవేందర్‌నాయక్, వంగాల ఎల్లయ్య, నాయకులు ఎండీ నయీం, పూస మధు, కాంచనపల్లి వనజారాణి, ఆవుల కేశవరెడ్డి, దేశబోయిన ఉపేందర్, పెండ్లి వెంకన్న, పంతంగి నర్సయ్య, పుల్లా ఎల్లాగౌడ్, గుగులోత్ సోమన్న, కొమ్ము రాజు, మొలుగూరి పున్నమయ్య, జలగం మల్లయ్య, ఎండీ మొహినొద్దీన్, మహేశ్, రాయరపు సారంగం, బాలూనాయక్, అంజయ్య, గాజుల నరేందర్, చిర్ర కిశోర్‌కుమార్, దేవేందర్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
పర్వతగిరి: మండలంలోని చౌటపెల్లి, మూడెత్తులతండా, గుగులోత్తండా, తూర్పుతండా, వడ్లకొండ, గోపనపెల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ బానోత్ సింగ్‌లాల్ ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో చౌటపెల్లి పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్, వైస్ చైర్మన్ తక్కళ్లపెల్లి మధుసూదన్‌రావు, డైరెక్టర్లు వల్లందాసు రంగయ్య, గోపాల్‌రావు, దామెర ఆగయ్య, సర్పంచ్ ఆమడగాని రాజు, జ్యోతి, మోతీలాల్, బానోత్ విజయ, చిన్నపాక శ్రీనివాస్, ఏనుగల్ ఎంపీటీసీ భూక్యా భాస్కర్, నాయకులు బానోత్ రవి, మాసాని వెంకట్, భాస్కర్, బొట్ల మధు పాల్గొన్నారు.