హనుమకొండ చౌరస్తా, నవంబర్ 20: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే గుర్తింపు పొందిన ఏకైక సంఘం టీజీవోస్ అని, ఆనాడు యుద్ధానికి సిద్ధమై టీజీవోస్ సంఘాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది ఉద్యోగులు జైలుకెళ్లారని, వారి త్యాగాలు నేడు మరువలేనివన్నారు. హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఉద్యోగుల ఎన్నో సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిషరించిందని, మిగిలిన సమస్యల పరిషారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని, స్వరాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలను సహృదయంతో పరిషరించారని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగ సంఘాలు పాలు పంచుకోవాలని అధికారులను కోరారు. తెలంగాణ రాష్ర్టానికి టీఎన్జీవోస్, టీజీవో సంఘాలు రెండు కళ్లలాంటివన్నారు. గెజిటెడ్ స్థాయి అధికారులు ఉద్యోగరీత్యా బిజీ లైఫ్ గడుపుతున్నారని, ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి జిల్లా అధికారులు అందరూ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ టీజీవో కోఆర్డినేటర్ జగన్మోహన్రావు మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్సీ, జీవో 317 ద్వారా ఎదురైనా ఇబ్బందులు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో నూతన టీజీవో భవనాలకు భూమి కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం టీజీవోస్ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. సమ్మేళనంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్, టీజీవోస్ అసోసియేషన్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు, కార్యదర్శి లక్ష్మణ్, వరంగల్ జిల్లా టీజీవో అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, హనుమకొండ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, వరంగల్ కార్యదర్శి ఫణికుమార్, జనగామ జిల్లా అధ్యక్షుడు అమ్జద్అలీ, మహబూబాబాద్ కార్యదర్శి రఫీ, జనగామ జిల్లా అధ్యక్షుడు అంజద్ అలీ, జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షుడు శామ్యూల్, ములుగు జిల్లా అధ్యక్షుడు వెంకయ్య, కార్యదర్శి దామోదర స్వామి, సురేశ్‌కుమార్, అన్వర్ హుస్సేన్, రాజేశ్‌కుమార్, మేన శ్రీను, తహసీల్దార్ రాజ్ కుమార్, ప్రభాకర్‌రెడ్డి, రాంకుమార్ రెడ్డి, శ్రీ కుమార్, శ్రీనివాస్ కుమార్, విజయనిర్మల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జగన్మోహన్రావు ఇంట్లో మంత్రి సమావేశం
హనుమకొండ చౌరస్తా : రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ టీజీవో కోఆర్డినేటర్ ఎన్నమనేని జగన్మోహన్రావు ఇంటికి ఆదివారం వెళ్లారు. హనుమకొండ వికాస్‌నగర్‌లోని జగన్మోహన్రావు ఇంట్లో పలువురు టీజీవో, టీఎన్జీవో ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు సత్యనారాయణ, కృష్ణయాదవ్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్‌రావు, మురళీధర్‌రెడ్డి, ఫణికుమార్, డాక్టర్ ప్రవీణ్, అమ్జద్అలీ, హసన్, రాజేశ్‌కుమార్, సురేశ్‌కుమార్, సంజీవరెడ్డి, నాగేశ్వర్రావు, నాగ నారాయణ తదితరులు పాల్గొన్నారు.