పోచమ్మమైదాన్/సంగెం, నవంబర్ 18: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్విం ద్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ జాగృతి నేతలు, టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో శుక్రవారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశా రు. తెలంగాణ జాగృతి జిల్లా అధికార ప్రతినిధి మడిపల్లి సుశీల్గౌడ్, విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు మస్కుల శివ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎంపీ అర్వింద్ బేషరతుగా క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు అర్వింద్‌కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. రానున్న రోజు ల్లో వరంగల్ జిల్లాకు రాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంగెంలోని అంబేద్కర్ కూడలిలో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గుండేటి బాబు, ఎంపీటీసీ మెట్టుపెల్లి మల్లయ్య, ఉపసర్పంచ్ కక్కెర్ల శరత్, కోడూరి సదయ్య, పొడేటి ప్రశాంత్, పెండ్లి పురుషోత్తం, వేల్పుల అఖిల్‌యాదవ్, దళితబంధు మండల అధ్యక్షుడు బొమ్మల శంకర్, చిర్ర రాజు, ప్రవీణ్, భరత్‌రెడ్డి, తోట ప్రభాకర్, జక్క సుభాష్, సుమన్, వడ్లకొండ శ్రావణ్, దుడ్డె ప్రశాంత్, గుండేటి కోర్నేలు పాల్గొన్నారు.