కృష్ణకాలనీ, నవంబర్ 5 : దివ్యాంగులు దేవతామూర్తులని, టీఆర్ఎస్ పాలనలో వారు ఆత్మైస్థెర్యంతో జీవిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సామాజిక అధికారిత శిబిర్ కార్యక్రమంలో భాగంగా అలిం కో సంస్థ సహకారంతో మహిళలు, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని సేవా భవన్లో జిల్లాలోని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, కృత్రిమ సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గండ్ర, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 72మంది దివ్యాంగులకు రూ. 35 లక్షల విలువైన బ్యాటరీ ట్రై సైకిళ్లు, 10 మందికి కృత్రిమ కాళ్లు ఉచి తంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు నెలకు రూ.3,016 అందజేస్తూ రూ. 2 వేల కోట్లకు పైగా పెన్షన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
దివ్యాంగులను ఆర్థికంగా మరింత ఆదుకోవాలనే లక్ష్యంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటా యింపులో 5శాతం, విద్యా, ఉద్యోగ, వైద్య రంగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జిల్లాలో దివ్యాం గుల కోసం రూ. 20 లక్షలతో ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేశామని, వారికి కార్పొరేషన్ లోన్లు అందించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర దివ్యాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి దివ్యాంగుడికి 100 శాతం సబ్సిడీతో సహాయ ఉపకరణాలు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 2016 వికలాంగుల యాక్టు అమలవుతోందని, దీని ద్వారా దివ్యాంగులను ఎవరైనా కించపరిచినా, అవమానపరిచినా శిక్షించవచ్చన్నారు. స్పైనల్ కార్డు, మస్క్యూలర్ డిస్ట్రోపీ వ్యాధితో బాధపడుతున్న దివ్యాంగులకు బర్డ్ ఆసుపత్రి నిర్మించాలని, వారికి ఫ్రీ మెడిసిన్, ఉచిత ట్రీట్మెంట్ ఇస్తూ, నెలకు రూ. 3వేల పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించానని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జడ్పీ వైస్ చైర్పర్సన్ శోభ పాల్గొన్నారు.