నర్సంపేటరూరల్/దుగ్గొండి/నల్లబెల్లి, నవంబర్ 5: దేశంలో రోజురోజుకు బీజేపీ ఆగడాలు పెరిగిపోతున్నాయని, మతోన్మాద హిందూ పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని వామపక్ష కమ్యూనిస్టు బహుజన శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఎంసీపీఐ(యూ) నర్సంపేట డివిజన్ సహా య కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి పిలుపునిచ్చారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు బీహార్ రాష్ట్రంలో జరుగనున్న ఎంసీపీఐ(యూ) జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను మాదన్నపేటలో శనివారం నాయకులు ఆవిష్కరించారు. కేంద్రంలోని బీజేపీ వామపక్ష ప్రజాతంత్ర హక్కుల సంఘాల నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు కేశెట్టి సదానందం, పార్టీ గ్రామ కార్యదర్శి అనుముల రమేష్, మాజీ సర్పంచ్ కర్నె సాంబయ్య, గుర్రం రవి, సహాయ కార్యదర్శి గాదగోని బాబు, కేశెట్టి శ్రీనివాస్, వక్కల రాజమౌళి, అల్లం నర్సయ్య, కందికొండ సాంబయ్య, రాజయ్య, రాజేందర్, రవి, ఐలయ్య పాల్గొన్నారు. అలాగే, మహాసభల పోస్టర్లను దుగ్గొండి మండలం తిమ్మంపేటలో పార్టీ నాయకులు ఆవిష్కరించారు. పార్టీ సీనియర్ నేత నాగెల్లి కొమురయ్య, మండల కార్యదర్శి తడుక కౌలస్య, నాయకులు నాగెల్లి భాస్కర్, దండు సారయ్య, సుదర్శన్‌రెడ్డి, ఎలకంటి చిన్నఎల్లయ్య, మెద్దు వెంకన్న పాల్గొన్నారు. నల్లబెల్లిలో ఎంసీపీఐ(యూ) మండల కార్యదర్శి దామ సాంబయ్య మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. మోదీ ప్రభుత్వం గద్దె దిగే వరకూ పోరాటాలను ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మార్త నాగరాజు, భట్టు సాంబయ్య, పరికి కోర్నెల్, ఏఐకేఎఫ్ డివిజన్ నాయకుడు బోళ్ల సుదర్శన్, సాగర్, సాంబయ్య పాల్గొన్నారు.