రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీ మూడో రోజు శుక్రవారం హోరీహోరీగా సాగింది. గెలుపే లక్ష్యంగా క్రీడాకారులు దూకుడు ప్రదర్శించారు. కోర్టులోకి దిగి పాయింట్ల కోసం నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. సెమీస్‌కు చేరేందుకు అండర్-15 బాలబాలికలు సర్వశక్తులొడ్డగా కుర్రకారుకు ఏమాత్రం తీసిపోకుండా ఆరు పదుల వయస్సుల్లో సత్తాచాటి ఔరా అనిపించారు వెటరన్స్. వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న 165 మంది క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో పలువురు సత్తా చాటగా, నేడు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ తో పోటీలు ముగియనున్నాయి.
– హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 28
రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు పోటాపోటీగా సాగుతున్నాయి. వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘యునెక్స్ సన్‌రైజ్ 8వ రాష్ట్రస్థాయి అండర్-15 బాలబాలికలు, వెటరన్స్(65+ 70+ , 75+ ) బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు సుబేదారిలోని వరంగల్ క్లబ్లో కొనసాగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ అండర్-15 ప్రీ క్వార్టర్స్ పోటీలు పోటాపోటీగా జరిగాయి. గెలుపే లక్ష్యంగా కోర్టులోకి దిగిన క్రీడాకారులు పాయింట్స్ సాధించేందుకు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడ్డారు. గెలుపే లక్ష్యంగా పోటీపడ్డారు. సెమీస్‌కు చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించారు.
వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.రమేశ్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ పింగిళి రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి 165 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు, అలాగే వెటరన్స్ విభాగంలో 65+లో 9 జట్లు 70+లో 8 జట్లు, 75+లో10 జట్లు పోటీ పడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం అండర్-15లో ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో గెలుపొందిన క్రీడాకారులు నేడు సెమిఫైనల్స్, ఫైనల్స్ ఆడనున్నారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్లో భువనేశ్వర్‌లో జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ డి.నాగకిషన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం.జితేందర్‌రెడ్డి, నిమ్మ మోహన్‌రావు, సంయుక్త కార్యదర్శి కొమ్ము రాజేందర్, రాజ్‌కుమార్, అగర్వాల్, రవిచంద్ర, చీఫ్ రెఫరీ కె.పాణిరావు, పీవీఎల్ కుమార్, హన్మంతరావు, కిశోర్, ఎం.శ్రీనివాసరెడ్డి, శ్యాంకుమార్, శ్రీధర్, అంపైర్లు భాస్కర్, కృష్ణవేణి, మల్లికార్జున్, రవి, శైలజ, అరుణ్, ప్రణయ్, వెంకటస్వామి, మహేశ్, రాహుల్, ఆఫ్రిద్ తదితరులు పాల్గొన్నారు.
అలీ సిద్ధికి(వరంగల్)పై యువసూర్య జాగర్లమూడి(హైదరాబాద్), కృషిభార్గవ్(హైదరాబాద్)పై నిషాంత్ భూక్యా(సూర్యాపేట), అక్షిత్‌రెడ్డి(మెదక్)పై శశాంక్ వనమాల(రంగారెడ్డి), తనమై నిహాల్ ఉత్తమ్(కరీంనగర్)పై అఖిలేష్ గౌడ్ సోమగాని(సూర్యాపేట), యోగేశ్వర్‌రెడ్డి(హైదరాబాద్)పై మనవ్(నిజామాబాద్), శ్రీఆదిత్య హర్షవర్ధన్(ఆదిలాబాద్)పై వివేక్(నల్లగొండ)గెలుపొందాడు.
హనుమంతరావు, బాలగంగాధర్(నిజామాబాద్)పై బి.శ్రీహరి-సుదర్శన్‌రెడ్డి(వరంగల్), గాజుల కైలాసం-వీరవెంట అప్పారావు(వరంగల్)పై చావా వెంకటేశ్వర్లు-బాబురెడ్డి(వరంగల్) గెలుపొంది ఫైనల్స్‌కు చేరారు.
వెంకటేశ్వర్రావు-జయప్రకాశ్(మెదక్)పై కె.నర్సయ్య-రాజలింగు(ఆదిలాబాద్), కె.మోహన్‌రావు, చెరుకు కిరణ్‌బాబు ఫైనల్స్‌కు చేరారు.
పీసీఎస్ రావు, రాఘవేందర్రావు(మెదక్), గోవిందరావు-రమణయ్య(కరీంనగర్), విజయ్‌కుమార్-సుబ్బారాయుడు(మెదక్)పై గెలుపొంది ఫైనల్స్‌కు వెళ్లారు.
రియా(హైదరాబాద్)పై కీర్తి మంచాల(వరంగల్), కన్మంతరెడ్డి వర్షిణిరెడ్డి(అదిలాబాద్)పై అక్షయ దరి(మెదక్), అవినీ గోవిందు విక్రమ్(రంగారెడ్డి)పై కైవల్య ధర్మపురి(కరీంనగర్), వైశాల్య కుంతల(కరీంనగర్)పై అమృతరావు (రంగారెడ్డి), శ్రావ్యారెడ్డి(మెదక్)పై అనుసంజన మురళి(హైదరాబాద్), వైష్ణవి (నల్లగొండ)పై రిషితా పాండే(వరంగల్), వీక్షిత(వరంగల్)పై దేవినేని రెదిమా(హైదరాబాద్), ప్రాంజలానిసర్గ(రంగారెడ్డి)పై సమీక్షారెడ్డి(హైదరాబాద్) గెలుపొందారు.
ఏ.మేదశ్రీ-ఎం.శ్రీలాస్య(సూర్యాపేట)పై భూక్యా రిత్వికశ్రీ- గీతిక మేడ్చల్(భద్రాద్రి), మరో టీంలో కీర్తి మంచాల-రిషిత పాండే(వరంగల్)-శరణ్యశ్రీ ముందుండి-శ్రావ్య ఆకుల(రంగారెడ్డి)పై గెలుపొందారు.
వాళ్లంతా 65 వయస్సు నుంచి 75 ఏళ్లు పైబడినవారు. అయినా కుర్రాలకు ఏమాత్రం తీసిపోకుండా కోర్టులో దుమ్ములేపుతున్నారు. మూడు పదుల వయస్సు కూడా లేని వారు పాయింట్ల కోసం విశ్వప్రయత్నం చేస్తుంటే వృద్ధ క్రీడాకారులు మాత్రం తమ ప్రతిభతో సునాయాసంగా ఆడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన వెటరన్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.