ఏటూరునాగారం, అక్టోబర్ 28: గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీఆర్ సేల్స్ డిపో ల్లో ఇక నుంచి మొబైల్ యాప్ ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేసే లా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏటూరునాగారంలోని గిరిజన భవన్లో ఏటూరునాగారం, నర్సంపేట, వెంకటాపురం, ములు గు, మహదేవపూర్, మన్ననూర్ బ్రాంచి పరిధిలో నడుస్తున్న డీఆర్ సేల్స్డిపోల సేల్స్మెన్లకు రెండు రోజుల పాటు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం జీసీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్‌కుమార్ ప్రారంభించి మాట్లాడారు. ఈ యాప్ తో అమ్మకాలు, నిల్వలను ఎప్పటికప్పుడు నమోదు చేయడమే కాకుండా అవకతవకలు జరుగకుండా ఉంటాయన్నా రు.
ఇందుకోసం జీసీసీ డివిజన్ పరిధిలో ని 200 మంది సేల్స్మెన్లకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఇక నుంచి యాప్ ద్వారానే అమ్మకాలు చేయాల్సి ఉంటుందన్నారు. పంపిణీ పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్పొరేషన్‌ను సక్రమంగా నడిపించేందుకు అనేక మార్పులు తీసుకవస్తున్నట్లు, ఇందులో భాగంగానే యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులు సైతం మానిటరింగ్ చేసే అవకాశం ఉందన్నారు. పూర్తి స్థాయిలో సంస్థను బలోపేతం చేయడంలో భాగంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. యాప్‌పై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని కోరారు. యాప్‌పై ట్రైయినర్ ఎస్ఎన్ మూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్లు దేవ్, హరిలాల్, శ్రీనివాస్, సమ్మయ్య పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జీసీసీ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో 14 మినీ పరిశ్రమలను జేఎల్‌జీ గ్రూపుల ద్వారా ఏర్పాటు చేశామని విజయ్‌కుమార్ తెలిపారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ షాంపులు, డిటర్జంట్, గ్లిజరిన్, నాప్కి న్, న్యూట్రిబాస్కెటు, దాల్ మిల్లులను రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సుమారు 300 మంది గిరిజనులకు దీంతో ఉపాధి లభించినట్లు తెలిపారు. ఇవి విజయ వంతంగా నడుస్తున్నాయని, ఇందులో 60శాతం సబ్సిడీ, 30శాతం బ్యాంకు రుణం, 10శాతం గ్రూపు నుంచి భరించాల్సి ఉం టుందన్నారు. ఈ పరిశ్రమల ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు చేపడుతున్నట్లు తెలిపారు. జీసీసీ ఆధ్వర్యంలో 5100 వన్‌ధన్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి అటవీ ఉత్పత్తుల సేకరణపై అవగాహన కల్పించి పరికరా లు అందజేసినట్లు వివరించారు. వీటి ఏర్పాటు తర్వాత అటవీ ఉత్పత్తుల సేకరణ రెండింతలు పెరిగినట్లు తెలిపారు. కొన్నిచోట్ల ముడి సరుకులను విక్ర యించకుండా వారే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందు కు వస్తున్నారని అన్నారు. జీసీసీ ద్వారా గిరిజనులను వ్యా పారవేత్తలుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు విజయ్‌కుమార్ వివరించారు.