వరంగల్, అక్టోబర్ 20: గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అనధికారిక నిర్మాణాలను బల్దియా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కూల్చి వేశాయి. గురువారం కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 46వ డివిజన్ కాజీపేట బాపూజీనగర్‌లో నాలుగు అంతస్తుల భవనంపై నిర్మించిన పెంట్‌హౌస్‌ను కూల్చివేశారు. 11వ డివిజన్ రంగంపేటలో అనుమతి లేకుండా నిర్మించిన పెంట్‌హౌస్‌ను తొలగించారు. ఈ సందర్భంగా సిటీ ప్లానర్ మాట్లాడుతూ టీఎస్ బీపాస్ అనుమతుల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మిస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ కూల్చివేతలను బల్దియా, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పర్యవేక్షించారు.