గీసుగొండ, అక్టోబర్18: పరిశ్రమలకు నిరంత ర విద్యుత్ అందించనున్నట్లు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రూ. 187 కోట్లతో నిర్మిస్తున్న 220/132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు కేటాయిం చిన 10 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. టీఎస్ఐ ఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావుతో కలిసి పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా కైటెక్స్, యంగ్వ న్ పరిశ్రమకు కావాల్సిన కరంట్పై అయన కంపె నీ ప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులతో సమీ క్షించారు. ఆయా పరిశ్రమలు ఎప్పటిలోగా పూర్త వుతాయనే అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చ ర్చించారు. పార్కులో ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించి ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పార్కులో వచ్చే పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందిస్తామన్నా రు. 2023 జనవరి లోపు 220/132 కేవీ విద్యు త్ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కైటె క్స్ పరిశ్రమ, యంగ్వన్ పరిశ్రమ నిర్మాణాలతో పాటు పార్కులో వచ్చే అనేక పరిశ్రమలకు ఈ సబ్‌స్టేషన్ ద్వారా నిరంతర విద్యుత్‌ను అందించ వచ్చన్నారు. కంపెనీ నిర్మాణాలు పూర్తి చేసుకొని తయారీ ప్రారంభించే లోపు విద్యుత్, నీటి సౌక ర్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారని తెలిపారు. కైటెక్స్ పరిశ్రమ ఫిబ్రవరిలోపు నిర్మాణం పూర్తి చేసు కుంటుందన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నా రు. రైతులకే కాకుండా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌ను అందజేస్తున్నట్లు తెలిపారు. అధి కారులు సమన్వయంతో గడువు లోపు పనులు పూర్తి చేసి పరిశ్రమలకు విద్యుత్ అందజేస్తామ న్నారు. భూపాలపల్లి కేటీపీపీ నుంచి 220/ 132 కేవీ విద్యుత్ పార్కుకు సరఫరా ఆవుతుందన్నారు. ఇప్పటికే పార్కులో నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించిన గణేశా ఈకోపెట్, ఈకోటెక్ పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అంద జేస్తున్నామన్నారు.
దేశంలోనే అతి పెద్ద పార్కు
–టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి
దేశంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అతి పెద్దదని, ముడి సరుకు నుంచి తయారీ వరకు ఇక్కడే తయారవుతుందని టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి అన్నారు. కైటెక్స్ పరిశ్రమ పనులను ప్రారంభించిందని, ఫిబ్రవరి లోపు పూర్తవుతా యన్నారు. యంగ్వన్ కొరియా పరిశ్రమకు పా ర్కులో 300 ఎకరాల భూమి కేటాయించామ న్నారు. డిసెంబర్ నెలలో పరిశ్రమకు పనులు మొ దలవుతాయన్నారు. ఈపరిశ్రమల నిర్మాణంతో 20 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలకు ప్రధానంగా కావాల్సిన విద్యుత్, నీళ్లును కూడా అధికారులు త్వరలోనే అందిస్తా రన్నారు. మంత్రి కేటీఆర్ ప్రతి రోజూ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశ్రమల స్థాపన కు కావాల్సిన ఏర్పాట్లపై నిత్యం హైదరాబాద్ అధికారులతో సమీక్షలు చేస్తుంటారని అయన అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు జగత్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మిషన్ భగీరథ సీఈ శ్రీనివాసరావు, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోష్, ట్రాన్స్‌కో ఎస్ఈ మణి పాల్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్ రావు, డీఈ మల్లికార్జున్, సామ్యానాయక్, యంగ్వన్ పరి శ్రమ ప్రతినిధి శ్రీకాంత్, కైటెక్స్ పరిశ్రమ ప్రతినిధి మనోజ్‌కుమార్, సోయేల్, మిషన్ భగీరథ డీఈ శ్రీనివాస్, ఏఈ సంపత్‌కు మార్ పాల్గొన్నారు.