వరంగల్, అక్టోబర్ 18(నమస్తేతెలంగాణ): పల్లెల్లో ఎల్ఈడీ వెలుగులు విరజిమ్ముతున్నాయి. విద్యుత్ వినియోగం, నిర్వహణ భారం తగ్గించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో శక్తి సామర్థ్యం వీధి దీపాల(ఈఈఎస్ఎల్)ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో 323 గ్రామపంచాయతీ పరిధిలో 42 వేల ఎల్ఈడీ లైట్లను అమర్చేందుకు ప్రణాళిక రూపొందించింది. వీధి దీపాల స్థానంలో వీటిని పెడుతున్నారు. ఇటీవల రాయపర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పనులు ప్రారంభించారు. ఇప్పటికే 49 జీపీల పరిధిలో 8,501 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరలో గ్రామగ్రామాన పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకుపోతున్నారు. ఈఈఎస్ఎల్తో విద్యుత్ ఆదా అవడంతోపాటు నిర్వహణ భారం కూడా తగ్గనుంది.
ప్రభుత్వం గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే పది మండలాల్లోని 49 గ్రామ పంచాయ తీల పరిధిలో ఈఈ ఎస్ఎల్ లైట్లను అమర్చడం పూర్తయింది. సాధ్య మైనంత త్వరలో జిల్లాలోని ఇతర గ్రామ పంచాయతీల పరిధిలో శక్తి సామర్థ్యం వీధి దీపాలను ఏర్పాటు చేయడం పూర్తి చేసే దిశగా పను లు కొనసాగుతు న్నాయి. ఇన్నాళ్లు గ్రామాల్లో పని చేస్తున్న వీధి దీపాల నిర్వహణతో విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతుండడం, ఫలి తంగా గ్రామ పంచాయతీలకు విద్యుత్ చార్జీల బిల్లులు అధికంగా వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్థానంలో ప్రత్యామ్నాయంగా ఈఈఎస్ఎల్లను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. తక్కు వ పవర్‌ను తీసుకుని ఎక్కువ వెలుతురు ఇవ్వడం ఈఈ ఎస్ఎల్ స్పెషల్. ఈ శక్తి సామర్థ్యం వీధి దీపాల ఏర్పాటుతో ఇన్నాళ్లు ఆయా గ్రామపంచాయతీ పరిధిలో వీధి దీపాల నిర్వహణకు జరుగు తున్న విద్యుత్ వినియోగం 30 నుంచి 40 శాతం వరకు తగ్గనుంద నేది అంచనా. దీంతో విద్యుత్ ఆదాతో పాటు గ్రామ పంచాయతీలకు వీధి దీపాల నిర్వహణ భారం కూడా తగ్గనుందని ప్రభుత్వం భావి స్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీల పరిధిలో ఈఈఎస్ఎల్ ఏర్పాటు పూర్తయింది. తాజాగా గ్రామాల్లో ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం తొలివిడుత రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఈ శక్తి సామర్థ్యం గల వీధి దీపాల ఏర్పాటు పనులను చేపట్టింది. ఈ పనులు మొదలైన ఆరు జిల్లాల్లో వరంగల్ ఒకటి. ఇటీవల రాయపర్తి మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలోని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు. జిల్లాలో 13 మండలాలు ఉండగా, వీటిలో 11 మండలాల్లో 323 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖానాపురం మినహా ఇతర పది మండలాల్లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. 49 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయని జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి ఎం సంపత్‌రావు వెల్లడించారు.
టార్గెట్ 42 వేల ఎల్ఈడీ లైట్లు
పదకొండు మండలాల్లోని 323 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 42 వేల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటివరకు మండలంవారీగా చెన్నారావుపేటలో 6, దు గ్గొండిలో 8, నల్లబెల్లిలో 3, నర్సంపేటలో 3, నెక్కొండలో 3, పర్వత గిరిలో 15, రాయపర్తిలో 8, వర్ధన్నపేటలో 2, సంగెంలో ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. గీసుగొండ మండల కేంద్రంలో కొద్ది రోజుల నుంచి ఈ పనులు జ రుగుతున్నాయి. 49 గ్రామ పంచాయతీల పరిధిలో 8,501 ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు చేశారు. ఇంకా 274 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 33 వేలకుపైగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈఈఎస్ఎల్ కింద ఆరు రకాల ఎల్ఈడీ లైట్ల ఏర్పా టుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 18, 35, 70, 110, 190 వాట్స్ ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో వీటి ఏర్పాటు పనులను ప్రభుత్వం ఒక సంస్థకు కేటా యించింది. సదరు సంస్థ ప్రతినిధులు ప్రతి గ్రామ పంచాయతీ పరిధి లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఆరు రకా ల్లో దాదాపు ఎనభై శాతం 18 వాట్స్ ఎల్ఈడీ లైట్లను గ్రామాల్లో అమర్చుతున్నారు. నలభై, అంతకంటే ఎక్కువ వెడల్పు గల రహదా రుల్లో 35 వాట్స్, జాతీయ రహదారులపై 70 వాట్స్, జంక్షన్లు, ఆల యాల వద్ద 110 లేదా 190 వాట్స్ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తు న్నారు. వీటి నిర్వహణ కోసం విద్యుత్ స్తంభాలకు సెంట్రలైజ్డ్ కంట్రో మానిటరింగ్ సిస్టమ్ అమర్చుతున్నారు. ఇన్నాళ్లు పని చేసిన వీధి లైట్లను తొలగించి వాటి స్థానంలో ఎల్ఈడీ లైట్లను అమర్చుతు న్నారు. వీటిని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏడేళ్ల వరకు ఇదే సంస్థ నిర్వహిస్తుంది. ఇన్నాళ్లు పనిచేసిన వీధి దీపాల మాదిరిగానే వెలుతురు ఇచ్చేలా గ్రామాల్లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నా యని అధికారులు తెలిపారు. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతో గ్రామ పంచాయతీలకు వీధి దీపాల నిర్వహణ భారం తగ్గనుందని పేర్కొ న్నారు. టీఎస్రెడ్కో ఈ ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు పనులను మానిటరింగ్ చేస్తోంది.