ఖానాపురం, అక్టోబర్ 18: అర్హులైన గిరిజన, గిరిజనేత ర పోడు రైతులకు హక్కు పత్రాలు అందించేందుకు ప్రభు త్వం చేపట్టిన భూముల సర్వేను జిల్లాలో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని కీర్య, దస్రు తండాల్లో చేప డుతున్న పోడు భూముల సర్వేను డీఆర్డీవో సంపత్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే తీరును, దాన్ని నిర్వహించడానికి ఎన్ని రోజుల ముందు రైతులకు నోటీ సులు అందజేస్తున్నారని కలెక్టర్ అధికారులను అడిగి తెలు సుకున్నారు. మొబైల్ యాప్‌లో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సర్వే చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివ రించారు. అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలకు బదు లుగా పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వాలని కీర్యతండా సర్పంచ్ హఠ్య కోరాడు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కేంద్రప్రభుత్వ ఆధీ నంలో ఉంటుందని, పోడుభూములకు హక్కు పత్రాలు మాత్రమే ఇవ్వగలమని కలెక్టర్ తెలిపారు. రైతుల వివరాలు యాప్‌లో నమోదు చేసే సమయంలో 2005 నుంచి అదే గ్రామంలో నివాసం ఉంటున్నట్లుగా ఓటర్ ఐడీని పొందు పర్చాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అనం తరం కలెక్టర్ మట్లాడుతూ జిల్లాలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని 7711 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిర్యాదు దారుడితో పాటు ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సర్వే చేపడు తున్నామని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 450 దర ఖాస్తుల పరిశీలన పూర్తి చేశామని అన్నారు. అవసరమైతే ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి సర్వేను స కాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దరఖా స్తు చేసుకోని వారికి అవకాశం లేదన్నారు. గిరిజనేతరులకు హక్కు పత్రాలు ఇవ్వాలంటే 3 తరాలకు వారు గ్రామం లోనే ఉండాలనే నిబంధన ఉందన్నారు. కుటుంబ ప్రాతి పదికన హక్కు పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. హక్కు పత్రాలతో రైతులు రుణాలు పొందే అవకాశం ఉందన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, ఇన్చార్జి ఆర్డీవో మహేందర్‌జీ, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, తహసీల్దార్ జు లూరి సుభాషిణి, ఎంపీడీఓ సుమనావాణి, సర్పంచ్ వెంక న్న, ఎఫ్ఆర్వో రమేశ్, డీఆర్వో మోహన్, ఆర్ఐ సత్యనారా యణ తదితరులు పాల్గొన్నారు.