కాశీబుగ్గ, అక్టోబర్18: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి ధర రికార్డు స్థాయిలో పలికింది. దేశీ రకం మిర్చి క్వింటా ల్కు రూ. 90 వేలకు వ్యాపారులు కొన్నారు. ఈ సంవత్సరం అత్యధికంగా క్వింటాల్ మిర్చి రూ. 65 వేలు ఉండగా, గత నెల 29న ఒక్క బస్తా మాత్రం రూ. 90 వేలు పలికింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రా మానికి చెందిన రక్తాని మోహన్‌రావు మంగళవారం మార్కెట్‌కు 11 బస్తాలు తేగా, విజయ ట్రేడర్స్ అడ్తి ద్వారా లక్ష్మీసాయి ట్రేడింగ్ కంపెనీ కరీదు వ్యాపారి రూ. 90 వేలు పెట్టి కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
కరోనా కలిసి వచ్చింది..
2020లో కరోనా సమయంలో మిర్చి క్రయవిక్రయాలు చాలా వరకు నిలి చిపోగా, చంద్రకిరణ్ కోల్డు స్టోరేజీలో నిల్వ చేసినట్లు మోహన్‌రావు తెలిపాడు. అప్పుడు క్వింటాల్‌కు రూ.18 వేలు ధర ఉందని, ఆ తర్వాత అవసరానికి రూ.45 వేలు, రూ.50 వేల చొప్పున మిర్చి అమ్మినట్లు చెప్పాడు. దిగుబడి చాలా వరకు తగ్గడంతో నిల్వ చేసుకున్న మిర్చికి ధరలు అత్యధికంగా పలుకు తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.